Begin typing your search above and press return to search.

దానికి కారణం వర్మేనట..

By:  Tupaki Desk   |   7 Dec 2015 3:31 AM GMT
దానికి కారణం వర్మేనట..
X
దర్శకుడిగా తరచూ విఫలమవుతున్న తరుణంలో రచయితగా రెండు సార్లూ సక్సెస్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తన స్వీయ జీవిత అనుభవాలను రంగరించి రాసిన నా ఇష్టం, Guns and Thighs పుస్తకాలను ప్రజలు ఎగబడి చదువుతున్నారు.

అయితే మొదటి పుస్తకంలో శ్రీదేవి బోనీ కపూర్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన రామూ ఈ రెండో సిరీస్ లో అమితాబ్ ప్రస్తావన తెచ్చాడు. సర్కార్ - సర్కార్ రాజ్ వంటి సినిమాలతో అమితాబ్ కి అద్భుతమైన పాత్రను సృష్టించి సినిమాను విజయతీరాలకు చేర్చి తనతో సాన్నిహిత్యం కుదుర్చుకున్న రామూనే తరువాత అమితాబ్ తో ఆగ్ - నిశబ్ద్ వంటి డిజాస్టర్లు తీశాడు. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడంకంటే ఎక్కువగా అమితాబ్ పాత్రపై తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. అసలు అమితాబ్ ఇలాంటి పాత్రలు ఎందుకు ఒప్పుకున్నాడంటూ మీడియా ఏకి పారేసింది.

అయితే వీటన్నిటికీ రామూ తన పుస్తకంలో సమాధానమిచ్చాడు. అమితాబ్ ఎప్పుడూ అత్యుత్తమ నటుడేనని ఆయన నటనపై దృష్టిపెట్టకుండా పాత్రపై ప్రయోగాలు చేయడంతోనే నేను తీసిన ఆ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయని, ఏ సినిమానైనా అమితాబ్ పాత్ర బాగోకపోతే అది తప్పకుండా దర్శకుడి పొరపాటేనని వెల్లడించడం విశేషం.