Begin typing your search above and press return to search.

అంత సీన్ ఏమీ కనిపించట్లేదు వర్మ

By:  Tupaki Desk   |   9 March 2018 6:23 AM GMT
అంత సీన్ ఏమీ కనిపించట్లేదు వర్మ
X

రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఒకప్పుడు దేశమంతా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వర్మ రొటీన్ గా అదే పట్టు పట్టడంతో మ్యాటర్ ఉన్నా సరే కొత్తగా అనిపించలేదు. దీంతో సినిమాలు ఎంత కష్టపడి తీసిన మడిపోయాయో తప్ప బెటర్ అనిపించలేదు. అయితే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా వర్మ చేసే పనిలో మాత్రం హైప్ పెరిగేలా చేస్తుంటాడు అని అందరికి తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళితే దాదాపు ఇరవై ఏళ్ల తరువాత వర్మ నాగార్జునతో జత కట్టి తీస్తోన్న సినిమా ఆఫీసర్.

ప్రస్తుతం ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక వర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ రెగ్యులర్ గానే ఉంది. ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేస్తోన్న పోస్టర్స్ లో కొత్తగా ఏమి కనిపించడం లేదు. నాగ్ యాక్షన్ సీన్స్ లలో స్టిల్స్ ఇస్తుండడం అంతగా వైరల్ అవ్వడం లేదు. కానీ వర్మ మాత్రం ఆఫీసర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. సొంత ప్రొడక్షన్ కంపెనీలో లో వర్మ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడా కూడా తగ్గకూడదు అనే రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నట్లు ఉన్నాడు.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక పోస్టర్ లో నాగ్ గన్ పట్టుకొని ఉండడం.. పక్కన కొత్త హీరోయిన్ మైరా రెగ్యులర్ గానే ఉన్నట్లు అనిపిస్తోంది. నాగ్ మాత్రం కొంచెం స్టయిలిష్ గా ఉన్నాడని చెప్పవచ్చు. అయితే కొంత మంది మాత్రం వర్మ ఫొటోస్ కింద డిఫెరెంట్ కామెంట్ చేస్తున్నారు. సినిమా ఏం తీస్తున్నాడో తెలియదు కాని.. ఈ ట్విట్టర్ ప్రచారంతో ఊదర గొడుతున్నాడు. అక్కడ మనోడు పొగిడినంత సీన్ ఏమీ కనిపించట్లేదు అని ఎవరి స్టైల్ లో వారు ట్వీట్ లు వేస్తున్నారు. మరి వర్మ గారు ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.