Begin typing your search above and press return to search.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' న్యూస్ అబద్దం : వర్మ

By:  Tupaki Desk   |   26 Sept 2017 6:28 PM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ న్యూస్ అబద్దం : వర్మ
X
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక కాన్సెప్ట్ ని అనుకున్నాడు అంటే చాలు అది ఎంత వివాదాస్పదంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ సినిమా అయినా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రచారాన్ని జరుపుకుంటుంది. కానీ వర్మ షూటింగ్ స్టార్ట్ చేయకముందు నుంచే వివాదాలతో చెలరేగి ప్రచారం భారీగా దానంతట అదే సాగుతుంది.

వంగవీటి తర్వాత ఇంకా ఏ వివాదాస్పద చిత్రాన్ని స్టార్ట్ చేయని వర్మ రీసెంట్ గా ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా చేసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీస్తానని చెప్పిన సంగతి తెల్సిందే.ఇంకా కథ కూడా పూర్తి చేశాడో లేదో గాని రోజుకో వార్త సంచలనంగా మారుతోంది. మీడియా కూడా వర్మ సోషల్ మీడియాలో ఏ తరహా వ్యాఖ్యలను పోస్ట్ చేస్తాడో అని తెగ ఎదురు చూస్తోంది. ఈ తరుణంలో సినిమా మీద వస్తున్న ఓ గాసిప్ పై క్లారిటీ ఇచ్చేశాడు. మొన్నటి నుంచి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను జెడి చక్రవర్తి నిర్మించబోతున్నాడని వార్తలు వచ్చాయి.

అంతే కాకుండా లక్ష్మి పార్వతి పర్మిషన్ కూడా తీసుకొని ఓ క్లారిటీకి జేడీ వచ్చారని కామెంట్స్ వినబడ్డాయి. దీంతో అందరు నిజమేనని నమ్మారు. అయితే వర్మ ఆ రూమర్ కి సింపుల్ గా సోషల్ మీడియా ద్వారా కామెంట్ తో పులిస్టాప్ పెట్టాడు. జేడీ నిర్మిస్తున్నాడని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని కొట్టి పారేశారు. అంతకు మించి ఒక్క వర్డ్ కూడా ఎక్కువగా రాయలేదు వర్మ. మరి ఆ వివాదాస్పద కథని ఎవరు నిర్మిస్తారో చూడాలి.