Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ అభిమాని వ‌ర్మ ఏమ‌య్యాడు?

By:  Tupaki Desk   |   8 Dec 2017 12:50 PM GMT
ప‌వ‌న్ అభిమాని వ‌ర్మ ఏమ‌య్యాడు?
X
రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఏమైంది....ఒక వైపు షాకింగ్ ట్వీట్లు....మ‌రోవైపు ఫేస్ బుక్ పోస్టుల‌తో సోష‌ల్ మీడియాను హ‌డ‌లెత్తించే వ‌ర్మ‌ ఏమైపోయాడు? ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌పై వ‌ర్మ నోరు మెద‌ప‌డేం? `అజ్ఞాత‌వాసి` వీరాభిమాని `అజ్ఞాత‌` వాసానికి కార‌ణ‌మేంటి? ....ఇవ‌న్నీ వివాదాస్ప‌ద‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ కామెంట్లు. సోష‌ల్ మీడియాలో సినిమా - రాజ‌కీయ‌ - స‌మ‌కాలీన అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించే వ‌ర్మ కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో, ఆయ‌న అభిమానులంతా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో వ‌ర్మ మౌన‌ముద్ర దాల్చ‌డానికి గ‌ల కార‌ణాల‌ను అన్వేషిస్తున్నారు. వ‌ర్మ సైలెన్స్ పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. అస‌లు వ‌ర్మ‌ బాగానే ఉన్నాడా? అని ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. ఫేస్ బుక్ లో, ట్విట్ట‌ర్లో వ‌ర్మ పోస్టులు అప్ డేట్ కాక‌పోవ‌డంతో వ‌ర్మ‌కు ఏమైందో అని బెంగ‌ప‌డుతున్నారు. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో వ‌ర్మ స్పందించ‌క‌పోవ‌డంతో ఎవ‌రికి తోచిన‌ట్లుగా వారు కామెంట్లు పెడుతున్నారు. వ‌ర్మ క‌న‌బ‌డుట లేదు....అంటూ సోషల్ మీడియాలో సెటైరిక‌ల్ కామెంట్లు పెడుతున్నారు.

ఇవాంకా అంద‌గ‌త్తె అని ఆమె గ‌ర్వంగా ఫీల్ అవుతుంద‌ని...కానీ, త‌న కంటే అందంగా ఉన్న కేసీఆర్ ను చూశాక ఆమె షాక్ అవుతుంద‌ని గ‌త నెల 23న వ‌ర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ త‌ర్వాత 29 - 30 తారీకుల్లో త‌న త‌ర్వాతి సినిమా హీరోయిన్ మైరా స‌రీన్ ను ప‌రిచ‌యం చేస్తూ, ఆమె ఫొటోల‌ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ స‌మ‌యంలో ఇవాంకా హైద‌రాబాద్ లో ప‌ర్య‌టిస్తున్నప్ప‌టికీ వ‌ర్మ ఆమెపై ఒక్క పోస్టు కూడా పెట్ట‌లేదు. దీంతో, వ‌ర్మ‌ను హౌస్ అరెస్టు చేశాడ‌ని నెటిజ‌న్లు సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఈ నెల 1న అఖిల్ న‌టించిన `హ‌లో ` సినిమా టీజ‌ర్ పై కామెంట్ చేశాడు. తాజాగా ప‌వ‌న్ ప‌ర్య‌ట‌నలో ఆయ‌న వ్యాఖ్య‌లు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నా వ‌ర్మ ఒక్క పోస్టు చేయ‌లేదు. ప‌వ‌న్ అభిమాని అయిన‌ వ‌ర్మ ఆ వ్యాఖ్య‌ల‌పై అస‌లు స్పందించ‌క‌పోవ‌డం ఆయ‌న అభిమానుల‌తో పాటు నెటిజ‌న్ల‌ను విస్మ‌యానికి గురిచేసింది. దీంతో, వ‌ర్మ‌పై నెటిజ‌న్లు సెటైరిక‌ల్ పోస్టులు పెడుతున్నారు. అయితే, నాగ్ తో చేయ‌బోతోన్న సినిమా స్క్రిప్ట్ - షూటింగ్ ప‌నుల్లో వ‌ర్మ బిజీగా ఉన్నాడ‌ని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వ‌ర్మ ఈ విధంగా కూడా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడ‌ని నెటిజ‌న్లు చ‌మ‌త్క‌రిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా...లేకున్నా...త‌న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌ద‌ని వ‌ర్మ‌ ప్రూవ్ చేసుకున్నాడని సెటైర్లు వేస్తున్నారు. అందుకే ఆయ‌న రామ్ గోపాల్ వ‌ర్మ అయ్యాడ‌ని పంచ్ డైలాగ్ లు పేలుస్తున్నారు.