Begin typing your search above and press return to search.

'మియా' తో వర్మ క్లైమాక్స్.. రేపు 5 గంటలకే..

By:  Tupaki Desk   |   13 May 2020 5:25 PM GMT
మియా తో వర్మ క్లైమాక్స్.. రేపు 5 గంటలకే..
X
దేశంలో లాక్‌ డౌన్ న‌డుస్తున్నా త‌న‌దైన శైలిలో పోస్టులు పెడుతూ వార్త‌ల్లో నిలుస్తుంటాడు రామ్ గోపాల్‌ వ‌ర్మ‌. వివాదాస్ప‌ద అంశాలను తన సినిమాలకు కథాంశాలుగా మార్చుకుంటూ సినిమాలు నిర్మిస్తున్న వ‌ర్మ ఆ మ‌ధ్య `జీఎస్టీ` (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్)‌ అంటూ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. జనవరి 27 - 2018న విడుదలైన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా ఎంత వివాదాస్పదమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మల్కోవా నటించిన ఈ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. తను అనుకున్న ప్రకారం దాన్ని విడుదల చేసి చూపించాడు ఆర్జీవీ. అయితే ఇప్పుడు ఆర్జీవీ మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరోసారి తన ఫేవరెట్ మియా మాల్కోవాతో చిత్రీకరించిన మరో సినిమా ‘క్లైమాక్స్’ అనే సినిమా టీజర్‌ ని గురువారం విడుదల చేస్తున్నట్లు ఆర్‌జీవీ ప్రకటించారు. ‘‘కరోనా ఇస్తున్న శాపాలు - లాక్‌ డౌన్ ఇచ్చిన ఆశీర్వాదాలతో నేను, మియా మాల్కొవా కలిసి రూపొందించిన క్లైమాక్స్ సినిమా టీజర్‌ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు" వర్మ తెలిపారు. శ్రేయస్ ఈటీ - ఆర్‌ ఎస్‌ ఆర్ ప్రొడక్షన్స్‌ లో ఈ సినిమా తెరకెక్కినట్లు వర్మ తెలిపారు. ఇక జీఎస్టీలో శృంగార ప్రియులకు కావాల్సిన విందును అందించిన వర్మ ఈ సారి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో.. అని శృంగార ప్రియులంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాను వర్మ లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ లో స్కైప్ ద్వారా డైరెక్షన్ చేసి తెరకెక్కించారని సమాచారం. మరి ఈ టీజర్ ను వర్మ ఎలా విడుదల చేస్తారనేది సస్పెన్స్. ఇక ఈ క్లైమాక్స్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కినట్లు తెలుస్తుంది. పూర్తి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నార‌ట‌.