Begin typing your search above and press return to search.
వంగవీటి ముందు రక్తచరిత్ర చిన్నది
By: Tupaki Desk | 5 Jan 2016 10:30 PM GMTఓ సినిమాని ప్రారంభించడంతోనే ప్రచారం కూడా మొదలు పెట్టేయడం వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్టైల్. ప్రతీ సినిమానీ ఏదో ఓ కాంట్రవర్సీతో లింక్ ఉండేలా చేయడం, ఏదీ లేకపోతే తనే ఓ వివాదం సృష్టించి పబ్లిసిటీ పొందడం వర్మకు.. పరిశ్రమ నేర్పిన విద్య.
మాఫియా నుంచి రౌడీయిజం వరకూ చాలానే కాన్సెప్ట్ లతో సినిమాలు తీసిన ఈ డైరెక్టర్.. మరోసారి బెజవాడ బేస్ గా సినిమా తీయబోతున్నాడు. ఓసారి బెజవాడ రౌడీలు అంటూ టైటిల్ పెట్టి, తర్వాత దాన్ని బెజవాడగా మార్చి.. అక్కడి రౌడీయిజాన్ని తన శిష్యుడి డైరక్షన్ లో కళ్లకు కట్టే ప్రయత్నం గట్టిగానే చేశాడు. కానీ ఈ మూవీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో మరోసారి ఇదే కాన్సెప్ట్ ని పక్కాగా తెరకెక్కించేదుకు సిద్ధమయ్యాడు. అందుకే ఈసారి ఎలాంటి ఇండైరెక్ట్ ఎత్తుగడలు వేయలేదు. తన మూవీకి 'వంగవీటి' అనే టైటిల్ పెట్టి తన ఉద్దేశ్యాన్ని నేరుగానే చెప్పేశాడు.
1980ల్లో బెజవాడ, చుట్టుపక్కల జరిగిన వాస్తవ చరిత్రకు, తనదైన సినిమాటిక్ టచ్ ఇచ్చి తీయబోతున్నాడన్న మాట. వంగవీటి రాధా మరణంతో మొదలయ్యి.. వంగవీటి రంగా హత్యతో ఈ స్టోరీ ఎండ్ అవుతుందని చెప్పాడు వర్మ. అంటే.. ఇది బెజవాడ బేస్డ్ గా నడిచే రాజకీయాలు, రౌడీయిజం, కుల ఘర్షణలే.. ఈ సినిమాలో చూపించబోతున్నట్లు అర్ధమవుతోంది. విజయవాడలోని సిద్ధార్ధ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుకున్న వర్మకు.. అప్పటి అక్కడి పరిస్థితులు బాగానే తెలుసు. వాటికే ఇప్పుడు తెరరూపం ఇవ్వబోతున్నాడు.
అన్నిటికంటే మించి చివర్లో ఓ ఫినిషింగ్ కూడా ఇచ్చాడండోయ్.. వంగవీటి చిత్రం రిలీజ్ అయ్యాక.. తను తీసిన రక్త చరిత్ర చిన్న పిల్లల మూవీలా ఉంటుందట. రక్తచరిత్ర అంటే పరిటాల రవిపై తీసిన చిత్రం అని పిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు తన పబ్లిసిటీ కోసం.. అంతటి స్టోరీని చిన్నపిల్లలాట అనేశాడంటే... దటీజ్ వర్మ అనాలి కదూ.