Begin typing your search above and press return to search.

వర్మ దాసరిని ఎందుకు కలిశాడు?

By:  Tupaki Desk   |   9 Jan 2016 12:48 PM IST
వర్మ దాసరిని ఎందుకు కలిశాడు?
X
దాసరి నారాయణరావు - రామ్ గోపాల్ వర్మ.. దర్శకులుగా ఇద్దరిదీ విభిన్నమైన శైలి. ఐతే తెలుగు సినీ పరిశ్రమపై ఇద్దరూ కూడా బలమైన ముద్ర వేశారు. లెజెండ్స్ అనిపించుకున్నారు. ఐతే ఈ ఇద్దరూ కలవడం చాలా అరుదు. ఆ మధ్య ‘రౌడీ’ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఓసారి ఇద్దరూ వేదికను పంచుకున్నారు. వర్మ గురించి అప్పట్లో దాసరి ప్రశంసల వర్షం కురిపించాడు. ఐతే వర్మ ఎప్పుడూ దాసరి గురించి మాట్లాడింది లేదు. అలాగే తనకు తానుగా వెళ్లి ఆయన్ని కలిసిందీ లేదు. ఐతే ఆశ్చర్యకరంగా నిన్న వర్మ స్వయంగా దాసరి ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి కొన్ని గంటల పాటు చర్చించి వచ్చాడు.

ఈ కలయికను సీక్రెట్ గా కూడా ఏమీ ఉంచకుండా ఫొటోలు కూడా విడుదల చేశారు. ఐతే ఆ ఫొటోలు రిలీజ్ చేసింది వర్మ కాదు, దాసరి. తన ఫేస్ బుక్ పేజీలో వర్మతో ఉన్న ఫొటో షేర్ చేశాడు దాసరి. అందులోనూ వర్మ తనదైన శైలిలో కాలు మీద కాలేసుకుని టీ కప్పు పట్టుకుని కనిపించాడు. ఐతే తామిద్దరం ఎందుకు కలిసింది చెప్పలేదు కానీ.. ఈ సందర్భంగా వర్మ కొత్త సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ మీద ప్రశంసలు కురిపించారు దాసరి. తాను ఈ సినిమాను చూశానని.. వర్మ చాలా బాగా తీశాడని దాసరి చెప్పారు. మరి తాను తీయబోయే ‘వంగవీటి’ సినిమాకు సంబంధించి సమాచారం కోసం దాసరిని కలిశాడా? లేక పవన్ కళ్యాణ్ తో దాసరి తీయబోయే సినిమాకు సలహాలేమైనా ఇవ్వడానికి కలిశాడా? ఇలాంటి కలయికల గురించి ట్విట్టర్లో డీటైల్డ్ గా చెప్పే వర్మ.. ఇంకా సైలెంటుగా ఎందుకున్నాడు?