Begin typing your search above and press return to search.

ఆర్జీవీ కొత్త మేటర్ పట్టుకొచ్చాడు

By:  Tupaki Desk   |   21 Jun 2018 4:19 AM GMT
ఆర్జీవీ కొత్త మేటర్ పట్టుకొచ్చాడు
X
రామ్ గోపాల్ వర్మ పేరు వింటే తెలుగు ప్రేక్షకులు ఉలిక్కి పడుతున్నారు. తెలుగు సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ డైరెక్టర్ కాలక్రమంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. వరస ఫ్లాపు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను భయకంపితులను చేస్తూ వచ్చాడు. చివరకు అక్కినేని నాగార్జునతో ఆఫీసర్ తీశాడు. ఆర్జీవీ - నాగ్ కాంబినేషన్ పై ఆశలతో థియేటర్ కు వెళ్లిన వారికి తీవ్ర ఆవేదనే మిగిలింది.

ఆఫీసర్ తెలుగు సినిమాల్లో అత్యంత డిజాసర్టర్ గా మిగిలిపోయింది. కరెక్ట్ గా చెప్పాలంటే పోస్టర్ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని సినిమా ఇది. ఆఫీసర్ దృష్టి నుంచి ప్రేక్షకులను మళ్లించాలని ఈమధ్య ఆర్జీవీ తెగ ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా తాను నిర్మాతగా ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. కన్నడ హీరో ధనుంజయ హీరోగా భైరవగీత అనే పేరుతో ఓ హింసాత్మక ప్రేమకథ తీయబోతున్నామని అనౌన్స్ చేశాడు. తాజాగా సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారి కోసం ఆర్టీవీ పెట్టిన అన్ స్కూల్ గురించి కొత్తగా సోషల్ మీడియాలో అప్ డేట్ పెట్టాడు. ఈ అన్ స్కూల్ గురించి గతంలోనే ప్రకటించాడు. అక్కడే కోర్సులుంటాయి.. ఏమేం నేర్పుతారనే విషయాలను రివీల్ చేశాడు.

తననందరూ సెల్యులాయిడ్‌ టెర్రరిస్ట్‌ అంటారని... తనలాంటివాళ్లని మరింతమందిని తయారు చేసి సినిమా ఇండస్ట్రీ మీదకు వదులుతా అంటూ వర్మ అన్ స్కూల్ అనౌన్స్ మెంట్ టైంలో ప్రకటించాడు. అయినా వర్మా.. ఇప్పుడు నువ్వు తీసిన ఒక్క సినిమా చూడాలంటేనే జనం బెంబేలెత్తిపోయి థియేటర్లకు రావడం లేదు. ఇంకా నీలాంటి వాళ్లంటే కష్టం.