Begin typing your search above and press return to search.

#DISHA ఆర్జీవీ ఇంట‌రాగేష‌న్ పేరుతో విసిగించాడా?

By:  Tupaki Desk   |   7 Feb 2020 4:12 AM
#DISHA ఆర్జీవీ ఇంట‌రాగేష‌న్ పేరుతో విసిగించాడా?
X
#DISHA ఘ‌ట‌న‌పై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు ఆర్జీవీ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్మ ఇప్ప‌టికే స్క్రిప్టు కోసం అన్వేష‌ణ మొద‌లు పెట్టిన‌ సంగ‌తి తెలిసిందే. ముందుగా ఏ2 ముద్దాయి చెన్న కేశ‌వులు భార్య రేణుక‌ను త‌న ఆఫీస్ కు పిలిపించుకుని సుదీర్ఘంగా చ‌ర్చించాడు. ఆ క్ర‌మంలోనే రేణుక‌పై ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర కురిసింది. చెన్నకేశ‌వులు ఎలాంటి వాడు? ఇంట్లో వ్య‌క్తుల‌తో ఎలా ఉండేవాడు? బ‌య‌ట వ్య‌క్తుల‌తో ఎలా మెలిగేవాడు? మ‌హిళ‌ల ప‌ట్ల ఎలా ప్ర‌వ‌ర్తించేవాడు? రేణుక‌-చెన్నకేశ‌వుల ప్రేమ ఏ వ‌య‌సులో మొద‌లైంది? ఎక్క‌డ మొద‌లైంది? కిరాత‌కుడే అయితే త‌న‌పై అస‌హ్యం క‌ల‌గ‌లేదా? దిశను హ‌త్య చేసిన త‌ర్వాత ఎన్ని గంట‌ల‌కు ఇంటికి వ‌చ్చాడు? ఆ స‌మయంలో ఇద్ద‌రు క‌లిసి ఎంత సేపు గ‌డిపారు? చెన్నకేశ‌వులు భ‌య‌ప‌డుతూ ఉన్నాడా? ఏమీ తెలియ‌ని అమాయ‌కుడిలా ఉన్నాడా? అస‌లు పోలీసులు ఇంటికొచ్చే ముందు జ‌రిగిన స‌న్నివేశం ఏంటి?.. ఇలా ర‌క‌ర‌కాల కోణాల్లో ఆల్మోస్ట్ ఆర్జీవీ ఇంట‌రాగేట్ చేసేశాడ‌ట‌.

దీన్ని బ‌ట్టి వ‌ర్మ త‌న స్క్రిప్ట్ లో చాలా విష‌యాల్ని డిస్క‌స్ చేయ‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. వ‌ర్మ ప‌దే ప‌దే రేణుక‌-చెన్న‌ కేశ‌వుల ల‌వ్ స్టోరీ పై ఎక్కువ‌గా ఫోక‌స్సివ్ గా ప్ర‌శ్నించాడు. త‌మ ప్రేమ క‌థ ఏ వ‌య‌సులో మొద‌లైంది? ఎన్నాళ్లు ప్రేమించుకున్నారు? రేణుకను ఎంత‌గా ప్రేమించాడు...అత‌నిలో తెలియ‌ని మ‌రో కోణం కూడా ఉందా?! అని ప్రశ్నించగా రేణుక త‌న భ‌ర్త మంచివాడ‌ని దిశ ఘ‌ట‌న‌కు ముందు త‌నతో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేద‌ని చెప్పుకొచ్చిందిట‌.

అలాగే ప్ర‌పంచ‌మంతా ఒక‌వైపు ఉంటే తానొక్క‌డే వేరొక‌వైపు ఉన్నాన‌ని వ‌ర్మ మ‌రోసారి నిరూపించాడు. ఎన్ కౌంట‌ర్ అనంత‌రం అంతా సంతోషించారు. కానీ ఆ బాధిత కుటుంబాల ప‌రిస్థితి ఏంటి? అని ఒక్క‌రు కూడా ఆలోచించ‌లేదు. ఆ కుటుంబాలు అన్నీ రోడ్డున ప‌డ్డాయి. వాళ్ల ప‌రిస్థితి ఏమిటి? అని వ‌ర్మ అస‌హ‌నం వ్య‌క్తం చేసాడు. ఈ సంద‌ర్భం రేణుక కుటుంబానికి వ‌ర్మ త‌న‌వంతుగా కొంత ఆర్ధిక స‌హాయం చేసాడు. అలాగే దాత‌లు ఎవ‌రైనా ఉంటే స్పందించండి అంటూ ఒక‌ అకౌంట్ నంబ‌ర్ ఇచ్చారు. నిజ‌ఘ‌టన‌ల్ని య‌థాత‌థంగా తెర‌కెక్కించ‌డం లో సిద్ధ‌హ‌స్తుడు. హైదరాబాద్ వైద్యురాలి హ‌త్యాచారాన్ని య‌థాత‌థంగా తెర‌కెక్కిస్తే అది ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర‌మైన భావోద్వేగాల‌కు తెర తీయ‌డం ఖాయం. అయితే దానిని ఒక ప్రేమ‌కథా చిత్రం తో ముడి పెట్టి చూపించ‌డం ద్వారా వర్మ టోన్ డౌన్ చేయ‌ద‌లిచాడా? అన్న‌ది చూడాలి.