Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో సినిమా తీసి లాజిక్ తో కొట్టాడు

By:  Tupaki Desk   |   30 May 2020 4:00 AM GMT
లాక్ డౌన్ లో సినిమా తీసి లాజిక్ తో కొట్టాడు
X
సినిమా తీయాల‌న్న క‌సి ఉంటే లాక్ డౌన్ తో ప‌ని లేద‌ని నిరూపించాడు ఆర్జీవీ. ఇత‌రుల్లా మూస ధోర‌ణిలో ఆలోచించ‌ని ఒకే ఒక్క‌డు అని నిరూపించాడు మ‌రి. అయితే లాక్ డౌన్ స‌మ‌యంలో సినిమాలు తీయ‌డం చ‌ట్ట విరుద్ధం క‌దా? ఎలా తీయ‌గ‌లిగాడు? అంటే ఆర్జీవీ చెబుతున్న లాజిక్ షాక్ కి గురి చేస్తోంది. అత‌డు చెప్పిన లాజిక్ ని విశ్లేషిస్తే ఎంతో ప‌ర‌మార్థం క‌నిపిస్తోంది. రొటీన్ గా బ‌తికే బ‌తుకు జీవుడికి ఆయన గారి వ్య‌వ‌హారికం చాలా క్రియేటివ్ గానే క‌నిపిస్తోంది మ‌రి.

ఇంత‌కీ ఏం లాజిక్ వాడాడు? అంటే.. కొవిడ్ 19 విష‌యంలో ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం సామాజిక దూరం పాటిస్తూ ప‌రిమిత సిబ్బందితో సినిమా తీశాడ‌ట‌. అంతేనా.. అస‌లు సినీప‌రిశ్ర‌మ యూనియ‌న్ల‌కు చెందిన వారిని ఎవ‌రినీ తీసుకోకుండా సినిమా షూట్ పూర్తి చేశాడ‌ట‌. లాక్ డౌన్ వేసిన వారం రోజుల్లో సినిమా ప్రారంభించి అది ఎత్తేసే స‌మ‌యానికి పూర్తి చేసేశాన‌ని చెబుతున్నారు వ‌ర్మ‌. నిబంధ‌న‌లు అతిక్ర‌మించ‌న‌ప్పుడు త‌ప్పు చేయ‌న‌ప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి. కేంద్ర‌- రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెప్పిన అన్ని రూల్స్ పాటించి `క‌రోనా వైర‌స్` సినిమాని చిత్రీక‌రించాను... అని ఆర్జీవీ అన్నారు.

ఆర్జీవీ చెబుతున్న లాజిక్కులు వింటుంటే మొండోడు అని ఆయ‌న‌ను ఎందుకు అంటారో అర్థం చేసుకోవ‌చ్చు. అస‌లు సినిమా తీయడానికి వంద మంది అక్క‌ర్లేదు అనేది ఆయ‌న ఉద్ధేశం. రెండోది అస‌లు సినీకార్మిక యూనియ‌న్ల నుంచి ప‌నోళ్ల‌ను తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏమిటి? వారికి భారీ పారితోషికాలు ఇచ్చి యూనియ‌న్ నిబంధ‌న‌ల్ని పాటించాల‌న్న రూల్ నాకెందుకు? అన్న వైఖ‌రి క‌నిపిస్తోంది. నిజానికి ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత‌లు కానీ ఆర్జీవీ కానీ ఈ రూల్స్ ప‌ట్టించుకునేందుకు ఏమాత్రం సుముఖంగా ఉండ‌రు. వీరంతా ఇండ‌స్ట్రీని బిజినెస్ యాంగిల్ లో మాత్ర‌మే చూస్తారు. ఉత్ప‌త్తిని త‌యారు చేయాలి. దానిని మార్కెట్లో ఎక్కువ ధ‌ర‌కు అమ్ముకోవాలి!! అన్న స్వార్థ‌పూరిత ఆలోచ‌న‌ను మాత్ర‌మే అమ‌ల్లో పెడుతుంటారు. దానిని బ‌హిరంగంగా చెప్పేందుకు కూడా ఏమాత్రం మొహ‌మాట ప‌డ‌రు.

అయినా తాను త‌ప్పు చేయ‌న‌ప్పుడు త‌ల‌వొంచాల్సిన పనేం లేద‌ని ఆర్జీవీ అనడం ఆస‌క్తిక‌రం. విపత్కర పరిస్థితుల్లో ఇన్నోవేటివ్‌గా నా ఆలోచనల్ని.. విజన్ ‌కు అనుగుణంగా మలచుకొన్నానని ఆర్జీవీ చెబుతున్నారు. నీ పనిని మరింత ఇన్నోవేటివ్‌గా చేయడానికి ఈ సమయం కరెక్ట్. అవసరాలు మనల్ని ఎక్కడికైనా తీసుకెళ‌తాయ‌ని అన్నారు.

క్లైమాక్స్ అనే చిత్రాన్ని ఓటీటీ వేదిక కోసం తీసాం. మియా మాల్కోవా నటించిన ఈ మూవీని శ్రేయాస్‌ఈటీ అనే యాప్ లో రిలీజ్ చేస్తామ‌ని ఆర్జీవీ తెలిపారు. ఇకపై యూట్యూబ్ కోసం కాకుండా ఓటీటీ కోస‌మే సినిమాలు తీస్తానన‌ని... సాధ్యమైనంత తొంద‌ర్లోనే `ఆర్జీవీ వరల్డ్` అనే సొంత ఓటీటీ వేదిక‌ను సిద్ధం చేస్తాన‌ని ఆర్జీవీ తెలిపారు.