Begin typing your search above and press return to search.

వంగవీటి కోసం విజయవాడకు వర్మ

By:  Tupaki Desk   |   22 Feb 2016 4:45 AM GMT
వంగవీటి కోసం విజయవాడకు వర్మ
X
వంగవీటి గురించి నాకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు.. కొన్ని రోజుల క్రితం ఇది వర్మ ఇచ్చిన స్టేట్మెంట్. తనకు ఆ ఫ్యామిలీతోపాటు, ముప్ఫై ఏళ్ల క్రితం బెజవాడలో జరిగిన పరిస్థితులు కూడా పర్ఫెక్ట్ గా తెలుసునని, అందుకే 'వంగవీటి' సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు మాత్రం వంగవీటిపై కొంత పరిశోధన చేయాలని అంటున్నాడీయన.

'వంగవీటిపై పరిశోధన చేసేందుకు 26వ తేదీన కొంత మందిని కలిసేందుకు విజయవాడ వెళ్తున్నా' ఇదీ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్. లైఫ్ పిక్స్ ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించడంలో ఈ దర్శకుడు దిట్ట. ఇప్పుడు వంగవీటి కోసం తనకే మొత్తం తెలుసు అనుకోకుండా.. కొంత రీసెర్చ్ చేయాలని అనుకోవడం పెద్ద విషయం కాదు. కానీ ఇలా విజయవాడకు వెళ్తున్నా అని చెప్పడంలోనే వర్మ అసలు ట్రిక్ ఉంటుంది. తన ప్రతీ అడుగునూ సినిమా ప్రమోషన్ కి వాడుకోవడమే వర్మ స్టైల్.

ప్రస్తుతం విజయవాడలో వర్మ తీస్తున్న సినిమాపై కొంత గందరగోళం ఉంది. వంగవీటి అనుచరులతో పాటు ప్రత్యర్ధులు కూడా కొంత ఆందోళన చేశారు. మరోవైపు ఈ సినిమా ద్వారా పాత గొడవలు మళ్లీ రేగే అవకాశం ఉందని కూడా కొందరు వాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో నేను విజయవాడ వస్తున్నా అంటూ ట్వీట్ పెట్టడమంటే.. మీరు రెడీగా ఉండండి అంటూ అవతలి వారికి హింట్ ఇవ్వడం అన్నమాట. ఇప్పుడక్కడ వర్మని వ్యతిరేకించేందుకు కొందరు రెడీ అవుతారుగా. అదీ రాంగోపాల్ వర్మ ప్లాన్.