Begin typing your search above and press return to search.
అదే రోజు, అదే సమయానికి వర్మ సంచలనం
By: Tupaki Desk | 17 Oct 2015 11:16 AM ISTఓ సినిమాకు ఎలా ప్రచారం తీసుకురావాలో వర్మకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పాలి. తన సినిమాల కంటెంట్ విషయంలో క్రియేటివ్ గా ఆలోచించడం మానేసి చాలా కాలమైంది కానీ.. మిగతా విషయాల్లో, ముఖ్యంగా పబ్లిసిటీ విషయంలో మాత్రం ఆయన ఎప్పుడూ నిత్య నూతనంగానే ఉన్నారు. తన కొత్త సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ విషయంలో ఇప్పటికే జనాల్లో బాగానే ఆసక్తి రేపారు వర్మ. ఈ మూవీ తొలి ట్రైలర్ జనాల్లో క్యూరియాసిటీ పెంచింది. ఇప్పుడిక రెండో ట్రైలర్ ను మాంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు వర్మ. అక్టోబరు 18న రాత్రి 10.40 గంటలకు ‘కిల్లింగ్ వీరప్పన్’ రెండో ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం సిద్ధం చేసుకున్నాడు వర్మ.
అయినా దేవుళ్లను ఏమాత్రం నమ్మని వర్మ ఇలా ముహూర్తం చూసుకోవడమేంటి అని ఆశ్చర్యం కలుగుతోంది కదా. అదేమీ పంతుళ్లు పెట్టిన ముహూర్తమేమీ కాదు. వర్మ తనకు తానుగా నిర్ణయించుకున్న ప్రత్యేక ముహూర్తం. 11 ఏళ్ల క్రితం సరిగ్గా అదే సమయానికి వీరప్పన్ ను అంతమొందించారు తమిళనాడు పోలీసులు. అందుకే ఆ ముహూర్తానికి ‘కిల్లింగ్ వీరప్పన్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాడు వర్మ. ఈ సినిమాలో వీరప్పన్ గా అచ్చం అలాంటి పోలికలే ఉన్న సందీప్ భరద్వాజ్ నటిస్తుండగా.. అతణ్ని అంతమొందించే అధికారి పాత్రలో శివరాజ్ కుమార్ నటిస్తున్నాడు. తన తండ్రి రాజ్ కుమార్ ను వంద రోజులకు పైగా చెరబట్టిన వీరప్పన్ ను చంపే పాత్రలో శివ రాజ్ కుమార్ నటిస్తుండటం విశేషం.