Begin typing your search above and press return to search.

ఆ చానెల్ ఫ్లైట్ ని వెంబ‌డిస్తుందంటూ వ‌ర్మ ఎటాక్

By:  Tupaki Desk   |   25 Sept 2020 8:59 AM IST
ఆ చానెల్ ఫ్లైట్ ని వెంబ‌డిస్తుందంటూ వ‌ర్మ ఎటాక్
X
జాతీయ‌ మీడియాతో వ‌ర్మ వివాదాలు కొత్త కాదు. తాజాగా ఆయ‌న బాలీవుడ్ డ్ర‌గ్స్ పై బ‌హిరంగంగా మాట్లాడ‌డం సంచ‌ల‌నంగా మారుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం త‌రువాత రియా కార‌ణంగా వెలుగులోకి వ‌చ్చిన డ్ర‌గ్స్ వివాదం బాలీవుడ్ ‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఈ వివాదాన్ని అడ్డుపుట్టుకుని ఓ జాతీయ మీడియాని వ‌ర్మ ఎటాక్ చేయ‌డం ప్ర‌తిసారీ చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

లైంగిన వేధింపులు ఎదుర్కొన్న ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ క‌డిగిన ముత్య‌మ‌ని స‌పోర్ట్ చేసిన ఆయ‌న‌ తాజాగా రిప‌బ్లిక్ టీవీపై మ‌రోసారి సెటైర్లు వేశారు. `రిప‌బ్లిక్ చాన‌ల్ చాలా రిచ్. దీపిక‌ను ఫాలో కావ‌డానికి ఓ చార్టెడ్ ఫ్లైట్ తీసుకున్నా ఆశ్చ‌ర్యం లేదు. గాల్లోనే వాళ్లు లైవ్ రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ప్లేన్ లెఫ్ట్ తీసుకుంది..రైట్ తీసుకుంది. దాని కిటికీ లోంచి క‌నిపిస్తోంది ఇప్పుడు డిన్న‌ర్ జ‌రుగుతోంద‌ని` అంటూ హిందీలో వ‌ర్మ వ్యంగ్యంగా సైటైర్లు వేశారు.

బాలీవుడ్ డ్ర‌గ్స్ వివాదంలో దీపిక పేరు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆమె త్వ‌ర‌లోనే ఎన్సీబీ అధికారుల ముందు హాజ‌రు కాబోతోంది. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. రిప‌బ్లిక్ చానెల్ లైవ్ విశ్లేష‌కుడు అర్న‌బ్ గోస్వామిపై `మీడియా ప్రాస్టిట్యూట్` అనే సినిమా తీస్తాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన వ‌ర్మ ఇప్పుడు మ‌రోసారి విరుచుకుప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.