Begin typing your search above and press return to search.

ఆర్జీవీ తగ్గట్లేదు..మరో నగ్న సినిమాకు రెడీ

By:  Tupaki Desk   |   8 Jun 2020 3:40 PM IST
ఆర్జీవీ తగ్గట్లేదు..మరో నగ్న సినిమాకు రెడీ
X
టాలీవుడ్ విలక్షణ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవలే అడల్ట్ కంటెంట్ తో తీసిన ‘క్లైమాక్స్’ను తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ యాప్ లో డైరెక్టుగా రిలీజ్ చేశాడు. అయితే దానికి ఆశించినంత ఫలితం రాలేదు. చాలా రివ్యూలు నెగెటివ్ రావడంతో సినిమా ఫ్లాప్ అన్న టాక్ వినిపించింది. పోర్న్ స్టార్ మియా మాల్కోవాను బోల్డ్ గా చూపిస్తూ తీసిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేక పోవడంతో వర్మ మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు.

ఇప్పుడు క్లైమాక్స్ తీసిన ఉత్సాహంలో రాంగోపాల్ వర్మ ‘నగ్న’ అనే మరొక సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులోనే కాదు ఇంగ్లీష్, హిందీ భాషల్లో క్లైమాక్స్ తరహాలోనే ఈ సినిమాను తీస్తున్నాడట.. ఓ వర్గం ఆడియెన్స్ టార్గెట్ గా ఈ కొత్త బోల్డ్ సినిమాకు రెడీ అవ్వబోతున్నాడు.

నగ్న సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను సాయంత్రం 5.30 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు వర్మ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో ఇది వైరల్ గా మారింది. టాలీవుడ్ లో ఎన్నో గొప్ప హిట్ చిత్రాలు తీసి ఇటీవల ఫ్లాపులతో కాలం గడుపుతున్న వర్మ ఇప్పుడు అడల్ట్ సినిమాలు తీసే స్థితికి దిగజారారా అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.