Begin typing your search above and press return to search.

వర్మ తీసేది 'లక్ష్మీ ఎన్టీఆర్' తెలుసా!!

By:  Tupaki Desk   |   18 Sep 2017 5:50 AM GMT
వర్మ తీసేది లక్ష్మీ ఎన్టీఆర్ తెలుసా!!
X
ఎన్ని చిత్రాల్లో నటించి తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టి తెలుగు రాజకీయాల్లో చరిత్రను సృష్టించిన లెజండరీ నటుడు నందమూరి తారకరామా రావు జీవిత చరిత్ర అనగానే ఎన్నో అనుమానాలు ప్రతి ఒక్కరిలో చెలరేగుతాయి. ఎంతో గొప్పగా బ్రతికిన ఆయన చివర్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పటికి చాలామంది ప్రముఖులు చెబుతుంటారు. అయితే ఆయన జీవిత చరిత్రను సినిమా తెరకెక్కించాలని చాలా మంది ప్రయత్నిచ్చారు కానీ అది మాటల వరకే పరిమతమయ్యింది.

ఇప్పటికి కూడా ఆయన సినిమా తెరకెక్కుతుందా లేదా అనేది కాస్త సందేహంగానే ఉంది. కానీ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని మరొకసారి బాంబ్ పేల్చాడు. అయితే ఆ సినిమా లక్ష్మి పార్వతి చుట్టూ తిరుగుతుందని సినిమా టైటిల్ కూడా "లక్ష్మీ ఎన్టీఆర్" అని ఆర్జీవీ తెరకెక్కించబోతున్నాడట. అయితే ఇప్పటికే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తానని చాలా సార్లు చెప్పాడు. కానీ ఏ దర్శకుడితో అన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. కానీ బ్యాక్ గ్రౌండ్ వర్క్ మాత్రం చాలా జరుగుతుందని చెప్పాడు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇప్పటివరకు ఎన్టీఆర్ గురించి సీక్రెట్ గా తెలుసుకున్న కొన్ని విషయాలను ఆధారంగా చేసుకొని.. కేవలం ఎన్టీఆర్ - లక్ష్మి పార్వతి ల జీవితం గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పాడు. ఈ విషయాన్ని ఆర్జీవీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు.

అయితే ఇంతకుముందు వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ని తీస్తానని చాలా సార్లు చెప్పాడు. అలాగే ఒక పాటను కూడా రిలీజ్ చేశాడు. బాలయ్య తనతో సినిమా తియ్యడానికి ఇష్టపడటం లేదని వర్మ తన స్టైల్ లో వేరొక పాయింట్ ను ఎంచుకోని సినిమాను తీస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి వర్మ ఈసారైనా సినిమా తీస్తాడో లేదో చూడాలి.