Begin typing your search above and press return to search.

రాజమౌళిది దురదృష్టమంటున్న వర్మ

By:  Tupaki Desk   |   13 July 2015 7:55 PM IST
రాజమౌళిది దురదృష్టమంటున్న వర్మ
X
తనకు నచ్చిన వాళ్ల గురించి రామ్‌గోపాల్ వర్మ ఎలా పొగుడుతాడో తెలిసిందే. ఇంతకుముందు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్‌ల గురించి వాళ్లు కూడా సిగ్గుపడిపోయేలా పొగిడాడు వర్మ. ఇప్పుడతడి కళ్లు రాజమౌళి మీద పడ్డాయి. బాహుబలి సినిమా చూశాక ట్విట్టర్ అంతా ఆ సినిమా గురించి పొగడ్తలతోనే నింపేశాడు. రాజమౌళిని చూసి మిగతా డైరెక్టర్లందరూ అసూయపడేలా ‘బాహుబలి’ని రూపొందించాడన్నాడు. ఇంకా చాలానే పొగిడాడు. పనిలో పనిగా బాహుబలిని విమర్శిస్తున్న వారి మీద కూడా బాణాలు ఎక్కుపెట్టాడు వర్మ. దేశమంతా బాహుబలి గురించి గొప్పగా చెబుతుంటే మన మీడియావాళ్లు, ఇండస్ట్రీ వాళ్లు దీని గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారని వర్మ ఎద్దేవా చేశాడు.

బాహుబలి సినిమాను చూసి తెలుగు పరిశ్రమ గర్వంగా ఫీలవుతోందని ఎవరైనా అంటే తనకు నవ్వు వస్తోందని.. నిజానికి ఇక్కడ ఆ ప్రసక్తే లేదని వర్మ అన్నాడు. ‘‘రాజమౌళి లాంటి దర్శకుడుండటం మన తెలుగువాళ్ల గర్వకారణం కాదు. అతను బొంబాయిలోనో, లాస్ ఏంజెల్స్‌లోనో పుట్టకపోవడం అతడి దురదృష్టం’’ అని వర్మ వ్యాఖ్యానించాడు. సినిమా కంటే తామే గొప్పవాళ్లమని విర్రవీగే హీరోలకు బాహుబలి మేలుకొలుపు అని.. తొలిసారి స్టార్ కంటే కూడా సినిమానే మిన్న అని రుజువు చేసిన సినిమా బాహుబలి అని వర్మ పేర్కొన్నాడు.