Begin typing your search above and press return to search.

అవతార్ 2 ని సినిమా కాదంటున్న రామ్‌ గోపాల్ వర్మ

By:  Tupaki Desk   |   16 Dec 2022 11:30 AM GMT
అవతార్ 2 ని సినిమా కాదంటున్న రామ్‌ గోపాల్ వర్మ
X
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తం గా సినీ ప్రేక్షకులు మరియు మీడియా సర్కిల్స్ వారు ఇండస్ట్రీ వర్గాల వారు ఎదురు చూస్తున్న అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ నేటి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం అవ్వడం తో మొదటి వీకెండ్ లోనే వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు కావడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఈ సమయం లో సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా కూడా అవతార్ 2 సినిమా గురించి చర్చ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా ను ఇప్పటికే చూసేసిన సినీ ప్రేమికులు తెగ రివ్యూలు రాస్తున్నారు. ఇదే క్రమంలో మన వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అవతార్ 2 సినిమా కు తన రివ్యూ ఇచ్చాడు.

ఆయన ట్విట్టర్ లో.. ఇప్పుడే అవతార్ 2 లో స్నానం చేశాను. దీన్ని సినిమా అని పిలిస్తే ఖచ్చితంగా అదో పెద్ద నేరం అవుతుంది. ఈ సినిమాలోని విజువల్స్.. యాక్షన్ సన్నివేశాలు జీవిత కాలం గుర్తుండి పోయేవిగా ఉంటాయి. కొద్దిసేపటి క్రితమే చూసిన ఈ సినిమా అద్భుతమైన ఫీలింగ్ ని ఇచ్చిందని పేర్కొన్నాడు.

మహాద్భుతం అన్నట్లుగా రామ్‌ గోపాల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా.. ఏం మాట్లాడినా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. జనాలు ఆయన వ్యాఖ్యలను గురించి కాస్త లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ సినిమా గురించి కూడా ఆయన పాజిటివ్గా ట్వీట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.