Begin typing your search above and press return to search.

జై ఆర్జీవీ.. ?

By:  Tupaki Desk   |   5 Jan 2022 12:30 PM GMT
జై ఆర్జీవీ.. ?
X
టాలీవుడ్ లో టాల్ మాన్ ఎవరూ అన్న చర్చ ఒక వైపు సాగుతూండగానే చాలా మంది సెలిబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. చిత్రమేంటి అంటే ఏపీ సర్కార్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల నొప్పి తగిలిన వారు గమ్మునున్నారు. మిగిలిన వారు అంతా వీరావేశం ప్రదర్శిస్తున్నారు. లేటెస్ట్ గా రామ్ గోపాలవర్మ ఉరఫ్ ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చేశారు. ఆయనదంతా లాజిక్కులతో కూడిన వాదనగా ఉంటుంది.

ఆయన చాలా ప్రశ్నలు వేశారు. చాలా డౌట్లు అందరిలో రగిలించారు. చివరికి ఆయన ఒక రకంగా గర్జించారు. అదేంటి అంటే మా సినిమాల మీద ప్రభుత్వ పెత్తనం ఏంటి అని. దాంతోనే వివాదం మరింతగా రాజుకుంది. మిమ్మల్ని గెలిపిస్తే మా నెత్తికెక్కుతారా అంటూ ఆవేశపడ్డారు. మొత్తానికి ఆర్జీవీ మార్క్ లాజిక్కులకు టాలీవుడ్ లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.

జై ఆర్జీవీ అంటున్నారు. చాలా మంది ఆర్జీవికి డైరెక్ట్ గా సపోర్ట్ ఇవ్వకపోయినా ఆయన అడిగిన తీరు బాగుంది అంటున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే జై ఆర్జీవీ అనేశారు. నేను అనుకున్నవన్నీ వర్మ అడిగేశాడు అంటూ ఆయన పొంగిపోయారు. చిత్రమేంటి అంటే ఇదే ఆర్జీవీ మీద ఒకనాడు మెగా క్యాంప్ చాలా గుర్రు మీద ఉండేది.

ఇపుడు సిట్యువేషన్ వేరు. అందుకే ఆర్జీవీ శభాష్ అంటున్నారు. కానీ ఆర్జీవీ అనబడే రామ్ గోపాల వర్మ ఈ ఇష్యూ తరువాత మరేది టేకప్ చేస్తారో ఎవరికీ తెలియదు, అపుడు ఎవరిని ఆయన టార్గెట్ చేస్తాడో అంతకంటే తెలియదు. మరి గతంలో ఆయన టార్గెట్ అయిన వారు ఇపుడు ఫుల్ ఖుషీ చేస్తే రేపటి రోజున వర్మ మరేమి మాట్లాడినా కూడా ఇదే తీరున రెస్పాన్స్ అవగలరా అన్న చర్చ కూడా ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే వర్మ మాత్రం గ‌ట్స్ ఉన్న సినీ పెద్దగా మారి ఏపీ ప్రభుత్వంతో ఒంటి కాలు మీద పోరాడుతున్నారు. ఆయన చేస్తున్న ఈ ఫైట్ తన కోసం అయితే అసలు కాదు, ఆయన ఐస్ క్రీమ్ సినిమాను కేవలం అయిదు లక్షల రూపాయలతోనే తీశాను అని చెప్పుకున్నారు. సో ఆయనకు సినిమా టిక్కెట్ల లెక్కతో నో ప్రాబ్లమ్. అయితే ఆయన భారీ సినిమాల కొరకే ముగ్గులోకి దిగిపోయారు. తన వాదనకు పోరాటానికి మద్దతు ఇమ్మనమని వర్మ మరీ మరీ కోరుతున్నారు. మరి సినీ జనం అంతా ఆయనకు మద్దతు ఇస్తారా.

అసలే టాలీవుడ్ లో ఎవరు పెద్ద అన్న దాని మీద ఇప్పటికీ తేల్చుకోలేక హాట్ హాట్ గా డిస్కషన్స్ ఒక వైపు సాగుతున్నాయి. మరో వైపు చూస్తే ఇంతకాలం వర్మ లాజిక్కులతో సినీ వర్గాన్నే టార్గెట్ చేసేవారు. అలాగే తాను ఎంచుకున్న పొలిటికల్ లీడర్స్ ని కూడా టార్గెట్ చేసేవారు. అలాంటి ఆయన ఫస్ట్ టైమ్ తాను ఎంతో అభిమానించే జగన్ మీదనే కత్తులు దూస్తున్నారు. మొత్తానికి ఆర్జీవీ టాలీవుడ్ లో టాప్ హీరో అయిపోయాడు. జై ఆర్జీవీ అని అంతా అనాల్సిన పరిస్థితి అయితే వర్మ తెచ్చేసుకున్నారు. చూడాలి మరి ఆర్జీవీ ట్వీట్ల యుద్ధం స్టోరీ ఏమిటో. అలాగే జగన్ సర్కార్ తో సమరం ఎంతదాకా సాగుతుందో.