Begin typing your search above and press return to search.

ఎన్ని తీస్తావయ్యా వర్మా?

By:  Tupaki Desk   |   5 March 2016 5:00 PM IST
ఎన్ని తీస్తావయ్యా వర్మా?
X
ప్రస్తుతం ఒక డైరెక్టర్ ఒకేసారి ఒక్కో సినిమాని తీయడమే మహా కష్టంగా ఫీలయిపోతున్నారు. ఒకటి తర్వాత ఒకటి వరుసగా తెరకెక్కించేందుకు నానా తంటాలు పడుతున్నారు. కానీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం.. ఒకేసారి మూడునాలుగు సినిమాలు కూడా తీసేస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. గవర్నమెంట్ అంటూ ఓ సినిమా తీస్తానని గతంలో ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ.

గ్యాంగ్ స్టర్స్ అయిన దావూద్ ఇబ్రహీం - చోటా రాజన్ లకు ప్రభుత్వాధికారులతో ఉన్న సన్నిహిత సంబంధాలే ఈ సినిమా కాన్సెప్ట్. దీన్ని ప్రకటించి చాలా రోజులే అవుతుండడంతో.. అందరూ ఈ మూవీ సంగతి వర్మ మర్చిపోయాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు సడెన్ గా దావూద్ ఇబ్రహీం రోల్ పోషించే వ్యక్తిని వెతుక్కున్న వర్మ.. అతని ఫోటోను ఫోటోను షేర్ చేశాడు. ఇతను ఎవరో ఇంకా రివీల్ చేయకపోయినా.. ప్రస్తుతం గవర్నమెంట్ కి సబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టేశాడు.

ఇంకోవైపు వంగవీటి కోసం కూడా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు వర్మ. సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఆర్జీవీ టాకీస్ అంటూ.. ఇంటర్నెట్ కోసం సెక్స్ బేస్డ్ కాన్సెప్ట్ లతో విచ్చలవిడిగా కూడా షార్ట్ ఫిలింలను తెరకెక్కిస్తున్నాడు. అసలు ఇన్నేసి సినిమాలను వర్మ ఒకేసారి ఎలా తీస్తున్నాడో?