Begin typing your search above and press return to search.

వర్మను సన్నీ లియోన్ తో పడుకోనిస్తే...?

By:  Tupaki Desk   |   24 May 2016 11:27 AM IST
వర్మను సన్నీ లియోన్ తో పడుకోనిస్తే...?
X
ఈ మధ్యే సన్నీ లియోన్ సినిమా ‘వన్ నైట్ స్టాండ్’ రిలీజైంది. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజవ్వగానే రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఓ ట్వీట్ పెట్టాడు. ‘‘సన్నీతో పడుకునే అవకాశం వస్తే ఎవరైనా లక్షల రాత్రులు కోరుకుంటారు కానీ.. వన్ నైట్ స్టాంట్ ఏంటి’’ అంటూ కొంటెగా వ్యాఖ్యానించాడు. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నీతో పడగ్గదిని పంచుకునే విషయమై వర్మకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. సన్నీ లియోన్ తో ‘వన్ నైట్ స్టాండ్’ ఛాన్స్ వస్తే ఎలా స్పందిస్తారు అని వర్మను మొహమాటం లేకుండా అడిగేశాడు ఇంటర్వ్యూయర్. దీనికి వర్మ తనదైన శైలిలో జవాబిచ్చాడు.

‘‘ఆ రాత్రి గడవగానే పొద్దున లేచి ఆ గదిలో డేనియల్ వెబర్ (సన్నీ భర్త) నాకోసం ఏమైనా కాచుకుని ఉన్నాడేమో చూస్తా. అతను నాపై దేంతో ఎలా దాడి చేస్తాడో తెలియదుగా’’ అన్నాడు వర్మ. విశేషం ఏంటంటే.. వర్మ ఇచ్చిన ఆన్సర్ చూసి ట్విట్టర్లో సన్నీ లియోన్ కూడా స్పందించింది. ‘‘హహ సూపర్ సార్’’ అని ట్వీట్ పెట్టింది. వర్మకు ఏమాత్రం ఛాన్స్ దొరికినా సన్నీ టాపిక్ మీద ఆసక్తికర ట్వీట్లు చేస్తుంటాడు. ఈ దేశంలో ప్రభుత్వం మీకు ఎక్కువ సంతోషాన్నిచ్చిందా.. లేక సన్నీ ఇచ్చిందా అని అప్పుడప్పుడూ పోల్స్ కూడా పెడుతుంటాడు. సన్నీని పెళ్లి చేసుకుని ఆమెతో పడక పంచుకునే అవకాశం పొందిన డేనియల్ వెబర్ ను చూస్తే తనకు చాలా జెలసీగా ఉందని అంటుంటాడు.