Begin typing your search above and press return to search.

మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు: వర్మ!

By:  Tupaki Desk   |   13 Feb 2019 10:15 PM IST
మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు: వర్మ!
X
అయినా మన పిచ్చిగానీ వర్మ ఒక ట్వీట్ చేయడం ఆ ట్వీట్ ఏదోఒకరకంగా న్యూస్ కాకపోవడం అన్నది జరుగుతుందా? ఆయన ఏ టాపిక్ పైన మాట్లాడినా న్యూసే.. అలాంటిది ఎన్టీఆర్ చివరి దశలో జరిగిన యదార్థాలను యధాతధంగా చూపిస్తానని చూపిస్తానని గత కొన్ని నెలలుగా తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ.. కొంతమంది జనాలకు కంటిమీద లేకుండా చేస్తున్న వర్మ రేపు ఉదయం.. అంటే ఫిబ్రవరి 14 న ఉదయం 9:27 am కు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టీజర్ ను రిలీజ్ చేయనున్నాడు.

ఈ విషయం ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అలా ఊరుకుంటే మిగతా వారికి గురుడికి తేడా ఏముంది? అందుకే టీజర్ కోసం ఒక కొంతమందిని టీజింగ్ చేస్తూ ఒక ట్వీట్ వదిలాడు. "ఎన్టీఆర్ అబద్ధపు అభిమానులారా, వెన్నుపోటుకు నిజమైన అభిమానులారా.. రేపు పొద్దున్నే మీ మీ ఇళ్ళకి దగ్గరలో ఉన్న గుళ్ళలో ఆంజనేయస్వామికి ఆకు పూజ చేసి రెడీగా ఉండండి. 9:27AM కల్లా మీ ముందుకు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్ ప్రత్యక్షం కాబోతోంది. మీ కన్నీళ్ళకి నేను బాధ్యుడిని కాదు. #LakshmisNTR" అంటూ ఎవరు ఈ టీజర్ చూసి భుజాలు తడుముకుంటారో వారికి సందేశం అందించాడు.

అయినా వాలెంటైన్స్ డే నాడు జనాలకు ఏదో ప్రేమ గురించి మేఘసందేశం లాంటిది ఇవ్వకుండా ఈ వెన్నుపోటు.. టీజర్ పోటు ఏంటో. అంతా బాగానే ఉంది కానీ గురుడు చెప్పినట్టు నిజాలను చూపిస్తాడా లేదా కొన్నిటిని దాచేసి తనకు నచ్చిన నిజాలతో సరిపెడతాడా అనే విషయం రేపటికల్లా మనకు తెలుస్తుంది. అయినా నాస్తికుడిలా వ్యవహరించే వర్మగారు ఈ ఆకు పూజల సలహా ఇవ్వడం ఎందుకో.. కొంపదీసి తమలపాకుల రేట్లు పెంచడానికి కంకణం కంకణం కట్టుకున్నాడా?