Begin typing your search above and press return to search.

వర్మ సంచలనం.. ఆమెను నగ్నంగా చూడాలనే సినిమా తీశా..

By:  Tupaki Desk   |   4 Jun 2020 3:20 PM IST
వర్మ సంచలనం.. ఆమెను నగ్నంగా చూడాలనే సినిమా తీశా..
X
వివాదాస్పద రాంగోపాల్ వర్మ ఏది మాట్లాడిన సంచలనమే. దేశంలో కరోనా-లాక్ డౌన్ విధించినా కూడా వెనక్కి తగ్గకుండా ప్రపంచంలోనే తొలి ‘కరోనా వైరస్’ మూవీని తెరకెక్కించి సంచలనం సృష్టించాడు. అంతటితో ఆగకుండా ముందే మొదలు పెట్టిన ‘క్లైమాక్స్’ మూవీని రిలీజ్ కు సిద్ధం చేశాడు. ఈ సందర్భంగా వర్మ ‘కరోనా వైరస్’ సినిమా పుట్టుక, పయనం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ ఈ వైరస్ కు భయపడి లాక్ డౌన్ విధించినప్పుడే దీనిమీద సినిమా తీయాలని అనిపించిందని.. కరోనా వైరస్ తో కలిగే భయాన్నే ఇతివృత్తంగా తీసుకొని కథ రాశానని వర్మ చెప్పుకొచ్చాడు. సాధారణంగా తనకు భావోద్వేగాలు ఉండవని.. కానీ ‘కరోనా వైరస్ స్క్రిప్ట్’ రాస్తున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నానని వర్మ తెలిపాడు. నా కెరీర్ లోనే ఇలా ఎప్పుడు జరగలేదన్నారు. ఒక కుటుంబంలో కరోనా లక్షణాలు భయట పడితే ఎంత దారుణంగా పర్యవసనాలు మారుతాయో అదే ‘కరోనా వైరస్’ మూవీ అని వర్మ తెలిపాడు.

ప్రేక్షకుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఓటీటీల వైపు అందరూ మారాలని.. అందుకే తాను ఓటీటీల్లోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నానని వర్మ తెలిపారు.

ఇక విజయవాడలో పుట్టిన తాను కాలేజ్ రోజుల్లో అమ్మాయిలను చూడాలంటేనే సిగ్గువేసేదని వర్మ తెలిపారు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాను కాబట్టే మియా మాల్కోవా లాంటి అందమైన లేడిని న్యూడ్ గా చూడాలనే ఆమెతో ‘క్లైమాక్స్’ సినిమా తీశానని వర్మ సంచలన నిజాలు వెల్లడించారు. వర్మ వ్యాఖ్యలు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.