Begin typing your search above and press return to search.

నివాళ్లు అర్పించిన వర్మ.. షాక్ అవుతున్న ఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   30 March 2022 5:32 AM GMT
నివాళ్లు అర్పించిన వర్మ.. షాక్ అవుతున్న ఫ్యాన్స్‌
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చావు విషయంలోను.. పుట్టుక విషయంలోనూ ఒకే విధమైన రియాక్షన్ ఇస్తూ ఉంటాడు. చనిపోయిన వారికి తనదైన శైలిలో నివాళ్లు అర్పించడం ఆయనకే చెల్లుతుంది. రామ్ గోపాల్‌ వర్మ ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్‌ రాజ్ కుమార్ చనిపోయిన సమయంలో ట్విట్టర్ లో విభిన్నంగా స్పందిస్తూ అందరి దృష్టిని ఆకర్షించి ప్రత్యేకంగా నిలిచాడు.

చనిపోయిన వారు అంతా గొప్ప వారు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసే రామ్‌ గోపాల్‌ వర్మ ఆ తర్వాత పునీత్‌ రాజ్ కుమార్‌ గురించి ఎప్పుడు కూడా పెద్దగా స్పందించలేదు.

ఆయన విషయంలో ఎప్పుడు కూడా ట్వీట్‌ కూడా చేయలేదు. కాని అనూహ్యంగా పునీత్‌ రాజ్ కుమార్‌ ఘాట్‌ కు వెళ్లి ఆయన కు నివాళ్లు అర్పించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వర్మ ను ఇలా చూడటం మొదటి సారి అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ లో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇది ఆయన లో కొత్త యాంగిల్‌ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

లెజెండ్రీ పునీత్‌ రాజ్ కుమార్‌ గారికి నివాళ్లు అర్పించాను అంటూ వర్మ ట్విట్టర్ లో పేర్కొనడం తో పాటు ఈ ఫోటో ను కూడా షేర్ చేయడం చాలా మందికి ఆశ్చర్యంతో పాటు షాక్ ను కూడా కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.

రామ్‌ గోపాల్‌ వర్మ మరియు పునీత్ ల మద్య ఆత్మీయ సంబంధం కాని.. ఇతర సన్నిహిత్యం కాని పెద్దగా లేదు. అయినా కూడా పునీత్‌ రాజ్ కుమార్‌ పై గౌరవంతో ఆయనకు నివాళ్లు అర్పించేందుకు ముందుకు రావడం వర్మ యొక్క మంచితనం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వర్మ లో ఈమద్య కాలంగా మార్పు కనిపిస్తుంది. వయసు ప్రభావమో లేదా మరేంటో కాని ఆయన లో మునుపటి జోరు హుషారు అయితే కనిపించడం లేదు అనేది స్వయంగా అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.