Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: వీ షేప్ ను ప్రదర్శిస్తున్న ఇస్మార్ట్ హీరో!

By:  Tupaki Desk   |   10 April 2019 7:36 AM GMT
ఫోటో స్టొరీ: వీ షేప్ ను ప్రదర్శిస్తున్న ఇస్మార్ట్ హీరో!
X
ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తన లుక్ ను మాత్రమే కాదు ఫిజిక్ ను కూడా పూర్తిగా మార్చుకున్నాడు. ఎప్పుడు స్లిమ్ గా.. హ్యాండ్సమ్ గా కనిపించే రామ్ కొత్త గెటప్ లో రగ్డ్ లుక్ లో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "స్ప్రెడ్ యువర్ వింగ్స్ #ఇస్మార్ట్ శంకర్ #రాపో2పాయింట్ఓ" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

షర్టు లేకుండా.. బనియన్ లేకుండా సల్మాన్ ఖాన్ లాగా తన కండలను ప్రదర్శించాడు రామ్. వెనక్కు తిరిగి పోజ్ ఇవ్వడంతో ఈమధ్య కఠినమైన కసరత్తులు చేసి సాధించిన బ్రాడ్ షోల్డర్స్.. 'వీ' షేప్ లో ఉన్న ఫిజిక్ క్లియర్ గా కనిపిస్తోంది. హెయిర్ స్టైల్.. గడ్డం.. మెడలో రుద్రాక్షల టైపులో చైన్లు చూస్తుంటే ఈ గెటప్ నిజంగానే రామ్ 2 పాయింట్ ఓ లాగానే ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తన సినిమాలో హీరోలను ఎప్పుడూ నెవర్ బిఫోర్ అన్న రీతిలో చూపిస్తాడు. ఒకవేళ కంటెంట్ కూడా కొత్తగా.. ఆడియన్స్ ను మెప్పించేదిగా ఉంటే మాత్రం ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి.. రామ్ లకు పెద్ద రిలీఫ్ ఇవ్వడం గ్యారెంటీ.

ఈ సినిమాలో నిధి అగర్వాల్.. నభా నటేష్ హీరోయిన్లు గా నటిస్తున్నాడు. ఈ సమ్మర్ సీజన్లోనే 'ఇస్మార్ట్ శంకర్' ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్.. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.