Begin typing your search above and press return to search.
హిట్ ఎవరిదైనా.. పొగడ్త చెర్రీదే
By: Tupaki Desk | 26 Sept 2015 4:46 PM ISTటాలీవుడ్ లో ఏదైనా మంచి విషయం ఉంటే చాలు.. చరణ్ ఫోన్ కాల్ వచ్చేస్తోంది. చిన్నా పెద్దా తేడా లేదు. తన పర బేధం లేదు. హిట్ కొట్టినా, మంచి పని చేసినా అప్రిషియేట్ చేయడంలో ఫస్ట్ ఉంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కొన్నివారాల క్రితం శ్రీమంతుడు సూపర్ సక్సెస్ అయినపుడు.. తనకు రామ్ చరణ్ తప్ప ఎవరూ ఫోన్ చేయలేదని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. అంతే కాదు.. రాణా - శర్వానంద్ లాంటి ఫ్రెండ్స్ తో పాటు.. ఇతర యువహీరోలు హిట్లు కొట్టినపుడల్లా చెర్రీ నుంచి ఫోన్ వస్తోంది
తాజాగా సుబ్రమణ్యం ఫర్ సేల్ తో మెగా సక్సెస్ సాధించాడు సాయిధరం తేజ్. చెర్రీ నుంచి ఫోన్ వచ్చిందని, హిట్ కొట్టినందుకు హ్యాపీ అని చరణ్ అన్నాడని చెప్పాడు ఈ మెగామేనల్లుడు. నిజానికి చరణ్ ఈ సినిమా చూడ్డం సాధ్యపడలేదు. బ్రూస్ లీని పూర్తిచేసేందుకు బిజీగా ఉన్నాడు చెర్రీ. కానీ వీలు చేసుకుని రిజల్ట్ తెలుసుకోవడమే కాకుండా.. ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపాడని అర్ధమవుతుంది.
ఇప్పుడున్న హీరోల్లో ఇంత సాఫ్ట్ కైండ్ పర్సన్ రామ్ చరణ్ ఒక్కడే. ఓపెన్ గా ఇతర హీరోలను, సినిమాలను పొగిడే మనస్తత్వంతో.. ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు మెగా పవర్ స్టార్. మనం హిట్ కొట్టడమే కాదు.. ఎవరు హిట్ సాధించినా ప్రశంసిస్తుండడంతో.. రామ్ చరణ్ కి ప్రశంసలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి ఇండస్ట్రీలో.