Begin typing your search above and press return to search.

అప్పా నా ఆచార్య‌తో మ‌ర‌చిపోలేని క్ష‌ణాలివి..

By:  Tupaki Desk   |   22 Aug 2021 12:00 PM IST
అప్పా నా ఆచార్య‌తో మ‌ర‌చిపోలేని క్ష‌ణాలివి..
X
22 ఆగ‌స్ట్.. మెగా బ‌ర్త్ డే సంబ‌రాలు చుక్క‌ల్ని తాకుతున్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లో నేడు మెగాస్టార్ చిరంజీవికి అప‌రిమితంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖ హీరోలంతా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అగ్ర బ్యాన‌ర్లు.. స్టార్ డైరెక్ట‌ర్లు .. చిన్న హీరోలు .. సాటి తారాగ‌ణం .. రాజ‌కీయ ప్ర‌ముఖుల నుంచి చిరుకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి.

నేడు వ‌రుస‌గా మెగాస్టార్ సినిమాల టైటిల్స్ ని ప్ర‌క‌టిస్తుండ‌డం ఆస‌క్తిని పెంచింది. ఇంత‌కుముందే చిరుతో మెహ‌ర్ ర‌మేష్ `భోళా శంక‌ర్` టైటిల్ ని మ‌హేష్ బాబు ప్ర‌క‌టించారు. టైటిల్ కి మెగాభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక వీడియోతో చిరుకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇందులో ఆచార్య షూటింగ్ కోసం అడ‌వుల్లోకి వెళుతూ చిరు-చ‌ర‌ణ్ బృందం ఎంత‌గా రిస్క్ చేస్తోందో క‌నిపిస్తోంది. ఆచార్య చిత్రంలో చ‌ర‌ణ్ దాదాపు 40 నిమిషాల నిడివి ఉన్న పాత్ర‌లో క‌నిపిస్తారు. చిరు-చరణ్ కాంబినేష‌న్ స‌న్నివేశాల్ని అడ‌వుల్లో చిత్రీక‌రించార‌ని ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఆచార్య‌ కీలక షెడ్యూల్ నల్లమల్ల అడవిలో జరిగింది. ఆ స‌మ‌యంలో త‌న కార్ ని డ్రైవ్ చేస్తూ చిరుతో క‌లిసి చరణ్ ప్ర‌యాణిస్తున్నారు. షూటింగ్ లొకేషన్ లో ప్ర‌వేశించాక చిరు - చరణ్ సన్నివేశాల‌కు సంబంధించి ఎప్పుడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం క‌నిపిస్తోంది. బాస్ చిరు సూచిస్తున్న‌ది వింటూ చ‌ర‌ణ్ ఎంతో బుద్ధిగా క‌నిపిస్తున్నారు.

జీవితంలో నేను మర్చిపోలేని క్షణాలివి.. నేను అప్పా అని పిలుస్తాను! నా #ఆచార్య ... పుట్టినరోజు శుభాకాంక్షలు! #HBD మెగాస్టార్ చిరంజీవి... `` అని చరణ్ ట్వీట్ చేశారు. త‌న తండ్రితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చ‌ర‌ణ్ మాటల్లో స్పష్టమ‌వుతోంది. ఆచార్య చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. దసరా కానుక‌గా విడుదల చేయాల‌ని భావిస్తున్నారు. అయితే మునుముందు స‌న్నివేశాన్ని బ‌ట్టి డేర్ స్టెప్ తీసుకుంటారు.

మెహ‌ర్ టైటిల్ ఓకే బాబి టైటిల్ ఏంటి?

ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ పూర్త‌యింది. ఇటీవ‌ల లూసీఫ‌ర్ రీమేక్ `గాడ్ ఫాద‌ర్` షూటింగ్ ప్రారంభ‌మైంది. త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి చ‌ర్చి ఫాద‌ర్ గా క‌నిపించ‌నున్నారు. టైటిల్ పాత్ర‌తో చిరంజీవి మెస్మ‌రైజ్ చేయ‌నున్నారు.

అలాగే త‌మిళ సినిమా `వేదాళం` రీమేక్ లోనూ చిరంజీవి న‌టించ‌నున్నారు. ఈ సినిమా తెలుగు టైటిల్ భోళా శంక‌ర్ అంటూ ప్ర‌క‌టించారు. మెహ‌ర్ ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మ‌రోవైపు య‌వ ద‌ర్శ‌కుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యాన్ బేస్డ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి `వాల్తేరు వీర‌న్న` అనే మాసీ టైటిల్ ని ఎంపిక చేసార‌ని స‌మాచారం. వాల్తేరు అనేది విశాఖ‌ప‌ట్ణ‌ణంలో ఫేమ‌స్ ఏరియా. టైటిల్ ని బ‌ట్టి వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని తెలుస్తోంది. మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నేడు టైటిల్స్ ని ప్ర‌క‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెకండ్ వేవ్ లో మ‌రో న‌లుగురు ద‌ర్శ‌కులు వినిపించిన క‌థ‌ల్ని ఫైన‌ల్ చేసి బౌండ్ స్క్రిప్ట్ తేవాల‌ని కోరిన‌ట్టు గుస‌గుస‌లు వినిపించాయి. అయితే అవ‌న్నీ అధికారికంగా ప్ర‌క‌టించాకే క్లారిటీ వ‌స్తుంది. మెహ‌ర్ ర‌మేష్ .. బాబి త‌ర్వాత జాక్ పాట్ కొట్టే ద‌ర్శ‌కుల్లో ఎవ‌రెవ‌రు ఉన్నారో కాస్త ఆగితే కానీ క్లారిటీ రాదు.