Begin typing your search above and press return to search.

మిస్టర్ సి తిరిగి జిమ్ లోకి వచ్చారు.. మ‌రి మీరు?

By:  Tupaki Desk   |   17 Sept 2020 3:20 PM IST
మిస్టర్ సి తిరిగి జిమ్ లోకి వచ్చారు.. మ‌రి మీరు?
X
కోవిడ్ 19 విజృంభ‌ణ సాగుతున్నా ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ఎత్తివేయ‌డంతో షూటింగుల గురించి సెల‌బ్రిటీలు ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లు సోష‌ల్ మీడియాతో టైమ్ పాస్ చేసినా ఇక‌పై సెట్స్ కెళ్లాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌ రామ్ చరణ్ కి అన్నివిధాలా భార్య ఉపసన అండ‌గా నిలుస్తున్నారు. తన ఇన్ ‌స్టాగ్రామ్ లో నిరంత‌ర యాక్టివిటీ ఎలా ఉందో ఉపాస‌న షేర్ చేస్తున్నారు. తాజాగా చ‌ర‌ణ్ జిమ్ ‌కు తిరిగి వెళుతున్నప్ప‌టి ఫోటోను అభిమానుల‌తో పంచుకున్నారు. ఇన్ స్టాలో ఫోటోను పంచుకుంటూ ఉపసనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్యానం జోడించారు. “మిస్టర్ సి తిరిగి జిమ్ లోకి వచ్చారు. మీరు?``జ ఇటీవ‌లే జిమ్ లు తెరుచుకునేందుకు అన్ లాక్ 4.0లో స‌డ‌లింపులిచ్చిన సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్లు మాల్స్ వ‌ర‌కూ ఇంకా ఛాన్స్ ద‌క్క‌లేదు. ఆ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ ఇలా ఇంటి వెలుప‌ల ఉన్న వేరే ట్రైన‌ర్ ఉండే జిమ్ కి వెళ్లార‌న్న‌మాట‌.

ఇక రామ్ చరణ్ కెరీర్ సంగ‌తి చూస్తే.. తదుపరి ఎస్.ఎస్.రాజమౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చ‌త్రీక‌ర‌ణ‌ను ముగించాల్సి ఉంది. ఇదివ‌ర‌కూ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రామ్ చరణ్ అల్లూరి లుక్ రిలీజ్ చేస్తే స్పంద‌న అద్భుతంగా వ‌చ్చింది. ఇంకా ఆలియాతో చెర్రీ సీన్స్ తీయాల్సి ఉంది. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుందని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని భావిస్తున్నారు.

అలాగే నిర్మాత‌గా చ‌ర‌ణ్ ప్ర‌యాణం చూస్తే.. ఖైదీనంబ‌ర్ 150- సైరా త‌ర్వాత ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన తండ్రి చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య`లో ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక క‌థానాయిక‌. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షూటింగ్ వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించ‌నున్నారు. ఓ దుర్ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన‌ ముగ్గురు ప‌వ‌న్ అభిమానుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు చ‌ర‌ణ్ ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. పవర్ స్టార్ పుట్టినరోజున ఆ సాయానికి సంబంధించిన ఫోటోలు ఇటీవ‌ల వైర‌ల్ అయ్యాయి.