Begin typing your search above and press return to search.

విధేయ రాముడికి బీహార్ లో ఏం పని ?

By:  Tupaki Desk   |   16 Dec 2018 6:40 AM GMT
విధేయ రాముడికి బీహార్ లో ఏం పని ?
X
సంక్రాంతి రేస్ లో మాస్ ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ గా ఉన్నది రామ్ చరణ్ వినయ విధేయ రామనే. బిజినెస్ పరంగా ఇప్పటికే సంచలనాలు నమోదు చేసిన ఈ మూవీ కి అభిమానులు ముద్దు గా వివిఆర్ అనే షార్ట్ కట్ ఫిక్స్ చేసి దాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. టీజర్ తో పాటు ఇప్పటిదాకా ఒక ఆడియో సింగల్ మాత్రమే విడుదలయ్యాయి. తస్సాదియ్యా అనే మరో మసాలా ట్రాక్ రేపు రిలీజ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా వివిఅర్ లో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఉందన్న క్లారిటీ టీజర్ చూసినప్పుడే వచ్చేసింది. కాకపోతే ప్లాట్ ఏమై ఉంటుందా అనే అనుమానం మాత్రం పూర్తిగా వీడలేదు. అయితే ఒక కీలకమైన అప్ డేట్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ఆ మధ్య ఇప్పటిదాకా ఎవరు షూటింగ్ చేయని అజర్ బైజన్ లో పాతిక రోజుల షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు తీసిన సంగతి తెలిసిందే. దానికి సంబందించిన బ్యాక్ డ్రాప్ తాలుకు న్యూస్ ఇది. కథ ప్రకారం వినయ విధేయ రామలో హీరో పాత్ర రామ్ బిహార్ కు వెళ్తుందట. అక్కడే విలన్ వివేక్ ఒబెరాయ్ ఎంట్రీ ఉంటుంది.

రామ్ అక్కడికి వెళ్ళడానికి నలుగురు అన్నయ్యలు ఉన్న తన కుటుంబానికి బలమైన లింక్ ఉంటుంది. తర్వాతే భీభత్సమైన ఫైట్లు సవాళ్ళు ప్రతిసవాళ్ళు మాస్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని టాక్. కరుడుగట్టిన రౌడీయిజం దాదాగిరికి సుప్రసిద్ధమైన బిహార్లో వచ్చే ఈ సీన్లని బోయపాటి శీను ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేసాడని తెలిసింది. ఈ ఎపిసోడ్ అంత అద్భుతంగా ఉండటం వల్లే ఇంకా తమిళ్ లో హీరోగానే కొనసాగుతున్న జీన్స్ ప్రశాంత్ ఇందులో సపోర్టింగ్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడట. మరి అంత స్పెషల్ గా అనిపించే ఆ బీహార్ ఎపిసోడ్ కనక క్లిక్ అయితే ధియేటర్లో మాస్ కి పూనకాలే