Begin typing your search above and press return to search.

ఖైదీతో మొదలు.. ఇక ధృవ ఆగడు..

By:  Tupaki Desk   |   19 Nov 2016 5:30 PM GMT
ఖైదీతో మొదలు.. ఇక ధృవ ఆగడు..
X
మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీకి తానే ప్రొడ్యూసర్ ముందే చెప్పిన రామ్ చరణ్.. అందుకు తగ్గట్లుగానే ఖైదీ నెంబర్ 150ను తీస్తున్నాడు. కేవలం చిరంజీవి సినిమా కోసమే చెర్రీ ఇలా నిర్మాతగా మారాడని అనుకున్నారంతా. కానీ.. చరణ్ నిర్మాతగా కంటిన్యూ కానున్నాడట. అది కేవలం మెగా మూవీస్ మాత్రమే కాకుండా.. ఇతర హీరోలతో కూడా సినిమాలు చేయబోతున్నాడట రామ్ చరణ్.

అక్కినేని అఖిల్ తో రామ్ చరణ్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్ షిప్ కోసమే కాకపోయినా.. ప్రొఫెషనల్ యాంగిల్ లో కూడా చెర్రీ-అఖిల్ ల రిలేషన్ డెవలప్ కానున్నట్లు తెలుస్తోంది. అఖిల్ అక్కినేని మరుసటి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడట రామ్ చరణ్. ప్రస్తుతం అఖిల్-విక్రమ్ కె కుమార్ ల ప్రాజెక్ట్ ఖాయం అయినా.. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగ్ నిర్మించనున్నాడు.

అఖిల్ చేసే మూడో సినిమాకు చెర్రీనే ప్రొడ్యూసర్ గా ఉండనున్నాడనే టాక్ వినిపిస్తోంది మరోవైపు శర్వానంద్ తో కూడా ఓ సినిమా నిర్మించనున్నాడట రామ్ చరణ్. స్టార్లతోకూ సినిమాలు తీసి.. స్టార్ హీరోగానే కాకుండా. స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా సెట్ అయిపోవాలని చూస్తున్నాడట చెర్రీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/