Begin typing your search above and press return to search.

ప్చ్.. చరణ్ కారుకు చాలా ఫైన్లు..

By:  Tupaki Desk   |   13 March 2017 10:47 PM IST
ప్చ్.. చరణ్ కారుకు చాలా ఫైన్లు..
X
గతంలో అయితే.. ఓ వాహనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని.. వెహికల్ నంబర్ ఉంటే.. దాని ఓవర్ వివరాలతో పాటు.. ఆ కారుపై ట్రాఫిక్ చలాన్లను సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం చిక్కింది.

ఇప్పుడు ఇదే అంశంలో రామ్ చరణ్ కారుకు సంబంధించిన కొన్ని డీటైల్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చెర్రీ ఉపయోగించే బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ కు ఇప్పటికి ఐదుసార్లు జరిమానా పడిందట. ఔటర్ రింగ్ రోడ్ పై స్పీడ్ లిమిట్ ను అతిక్రమించడంతోపాటు.. రాంగ్ పార్కింగ్ పై కూడా పెనాల్టీలు పడగా.. ఇంకా వీటిని చెల్లించలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోలకు చెందిన అల్ట్రా మోడర్న్ కార్లు అత్యంత వేగంగా వెళతాయనే సంగతి తెలిసిందే. అయితే.. ఒకవైపు రక్తదానం గురించి ప్రచారం చేసే చరణ్.. ఇలా ప్రమాదాలకు కారణమయ్యే ఓవర్ స్పీడింగ్ ను ఆశ్రయించడం ఆశ్చర్యకరమే.

అయితే పెనాల్టీలకు రామ్ చరణ్ కారణం అని చెప్పలేం. ఎందుకంటే డ్రైవర్ కూడా కారణం అయి ఉండవచ్చు. అయినా సరే.. ఇలాంటి విషయాల్లో హెచ్చరించాల్సిన బాధ్యత చెర్రీదే. ఎందుకంటే.. వివాదాలు వచ్చినపుడు అందరూ నాలుగు రాళ్లు వేసేది సెలబ్రిటీలపైనే కదా.. పైగా కోర్టులు కూడా కారు ఓనర్లను కఠినంగా శిక్షించమని చెబుతున్నాయి. జాగ్రత్తమ్మా చరణ్‌!!