Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ రెండు స్టార్ట్ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   10 Oct 2015 10:07 PM IST
రామ్ చరణ్ రెండు స్టార్ట్ చేస్తున్నాడు
X
చిరంజీవి రీఎంట్రీకి ప్రొడ్యూసర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ విషయం ఎప్పుడో కన్ఫాం అయిపోయింది. అయితే మరి నిర్మాత అవతారమెత్తాలంటే ప్రొడక్షన్ హౌజ్ ఉండాలి. ఓ బ్యానర్ స్టార్ట్ చేయాలి. ఇప్పటివరకూ చెర్రీకి సొంత బ్యానర్ లేదు. నాగబాబుకి అంజనా ప్రొడక్షన్స్ ఉంది. అల్లు అరవింద్ కి గీతా ఆర్ట్స్ - గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ ఉన్నాయి.

ఇప్పుడు చెర్రీ కూడా రెండు బ్యానర్స్ స్టార్ట్ చేస్తున్నాడు. వీటిలో మొదటిది తమ ఇంటి పేరుతో కొణిదెల ప్రొడక్షన్స్ కాగా.. రెండోది వైట్ హార్స్ ప్రొడక్షన్స్. కొణిదెల బ్యానర్ పై భారీ బడ్జెట్ మూవీస్ ని, వైట్ హార్స్ బ్యానర్ పై చిన్న చిత్రాలను తీయాలని నిర్ణయించుకున్నాడు చరణ్. అంటే.. మెగాస్టార్ తో తీయబోయే 150చిత్రాన్ని కొణిదెల బ్యానర్ పై తీస్తారన్నమాట. ఇప్పుడు చెర్రీకి చిన్న చిత్రాలకి ఓ బ్యానర్ స్టార్ట్ చేయడమంటే.. తాను కూడా స్మాల్ మూవీస్ తీస్తాడని అర్ధం చేసుకోవచ్చు. తమిళ్ లో ధనుష్ ఇలాగే ఇతర హీరోల మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాడు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో అయితే నాగ్ కి ఈ అలవాటుంది. కానీ యంగ్ జనరేషన్ లో ఇలాంటి ఎటెంప్ట్ చేయబోతున్న స్టార్ రామ్ చరణే. ఈ ఆలోచనకు గీతా ఆర్ట్స్2 ఇచ్చిన ఇన్ స్పిరేషన్ కారణం అయుండచ్చు.

ఇకపోతే.. చెర్రీకి గుర్రాలపై ఎంత ప్రేమ ఉందో.. వైట్ హార్స్ తో ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నాడు కదూ.