Begin typing your search above and press return to search.

#ఆచార్య .. చరణ్ ఆల‌స్యానికి కార‌ణం ఇదే

By:  Tupaki Desk   |   9 Dec 2020 10:00 AM IST
#ఆచార్య .. చరణ్ ఆల‌స్యానికి కార‌ణం ఇదే
X
చిరంజీవి `ఆచార్య` చిత్రంలో రామ్ చరణ్ కీలకమైన 40 నిమిషాల‌ ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవ‌లే చిరంజీవిపై కీల‌క స‌న్నివేశాల చిత్ర‌ణ‌తో షూట్ తిరిగి ప్రారంభమైంది. మ‌రి చరణ్ ఎప్పుడు సెట్స్ లోకి చేరతారోన‌న్న ఉత్కంఠ‌ అభిమానులకు ఉంది.

చరణ్ జనవరి మూడవ వారంలో షూట్ ‌లో పాల్గొంటారని ..అతనిపై స‌న్నివేశాల్ని ఒకే షెడ్యూల్ ‌లో పూర్తి చేస్తార‌ని ప్ర‌చార‌మైంది. ఇదంతా నిజ‌మే అయినా .. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవ‌ని తెలుస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. రామ్ చరణ్ ఆర్.‌ఆర్.‌ఆర్ పూర్తి చేసిన తర్వాత మార్చి నెలలో మాత్రమే ఆచార్య చిత్రీక‌ర‌ణ‌లో చేరతారు. కాబట్టి అప్పటికి చిరుతో సాధ్యమైనంత ఎక్కువ సన్నివేశాలను పూర్తి చేయాల‌ని కొర‌టాల భావిస్తున్నార‌ట‌. చిరు - చరణ్ కాంబినేష‌న్ సీన్లు పూర్తి చేయడానికి ప్రధాన షెడ్యూల్ కోసం వేచి ఉండాల్సిన ప‌రిస్థితి ఉంది. ఆచార్య త‌ర్వాత చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాల్సి ఉండ‌గా.. చ‌ర‌ణ్ కి భారీ ప్లానింగ్స్ ఉన్నాయి.