Begin typing your search above and press return to search.
మళ్లీ అదే పని చేస్తున్న రామ్ చరణ్
By: Tupaki Desk | 23 Oct 2015 11:00 PM ISTఎందుకో ఇప్పటి యంగ్ హీరోలు.. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ.. మెగాస్టార్ చిరంజీవిలు పనిచేసినట్లు అస్సలు చేయలేకపోతున్నారు. కనీసం రెండు సంవత్సరాలకు మూడు సినిమాలు ఇవ్వండయ్యా అంటే.. అది కూడా అసాధ్యంగానే కనిపిస్తోంది.
ఇకపోతే మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. సంవత్సరానికి ఒక్క సినిమానే అన్న చందానే వెళుతున్నాడు. ఆల్రెడీ గత ఏడాది అక్టోబర్ లో గోవిందుడు అందరివాడేలే సినిమాతో పలకరించిన చరణ్.. ఈ ఏడాది మళ్లీ అక్టోబర్ లో బ్రూస్ లీ అంటూ వచ్చాడు. ఇకపోతే వచ్చే ఏడాదే మనోడి తదుపరి సినిమా వచ్చేదని వెరీ క్లియర్. పోనివ్ సమ్మర్ లో వచ్చేసి మళ్ళీ డిసెంబర్ కు ఏమైనా రెండో సినిమా అందిస్తాడా 2016లో? ఏమో చెప్పలేం.
మనోడి తీరు చూస్తుంటే అలా కుదరదనే అనిపిస్తోంది. తని ఒరువన్ రీమేక్ ను ఇన్ కేస్ మొదలెడితే మాత్రం 2016 జనవరిలో స్టార్టు చేస్తాడట. అప్పుడు మొదలెడితే.. సినిమా ఒక 4 నెలల్లో పూర్తయినా.. తిరిగి జూన్-జూలై లోనే వస్తుంది. ఎందుకంటే మనోడు ప్రస్తుతం 2 నెలల గ్యాప్ తీసుకొని.. అప్పుడుకాని ఈ సినిమా మొదలెట్టడట. మళ్ళీ మళ్లీ ఇలా సినిమా సినిమాకూ మధ్యన ఇంత గ్యాప్ అంటే ఎలా చెర్రీ?