Begin typing your search above and press return to search.

సుక్కుతో చెర్రీ.. ఈరోజు నుండే స్టార్ట్

By:  Tupaki Desk   |   30 Jan 2017 12:00 AM IST
సుక్కుతో చెర్రీ.. ఈరోజు నుండే స్టార్ట్
X
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ.. చాలా కాలంగా ఇండస్ట్రీ జనాల్లో నానుతున్న టాపిక్ ఇది. మెగా పవర్ స్టార్ ఇప్పటికే సుక్కుతో సినిమా చేస్తున్నానంటూ మాటల మధ్యలో చాలాసార్లే చెప్పాడు. పీరియాడికల్ లవ్ స్టోరీ అనడమే తప్ప.. ఈ సినిమా గురించిన అధికారికమైన ప్రకటన ఇప్పుడు తొలిసారిగా చేశాడు రామ్ చరణ్. ఈరోజు (సోమవారం) నుండే మొదలెడుతున్నట్లు చెప్పేశాడు.

'దర్శకుడు సుకుమార్ తో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నా మరుసటి చిత్రం రేపే లాంఛింగ్' అంటూ ఆదివారం సాయంత్రం తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా అఫీషియల్ గా ముహూర్తం షాట్ గురించి చెప్పేశాడు రామ్ చరణ్. ఇప్పటికే ఈ మూవీ కోసం కొన్ని నెలలుగా వర్కవుట్ చేసిన సుకుమార్.. ఫైనల్ బౌండ్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నాడు. సహజంగా సుక్కు సినిమాలు కొంత ఆలస్యం అవుతాయ్ కానీ.. ఈ చిత్రం అంతా పీరియాడికల్ కాన్సెప్ట్ కావడంతో.. ఓ పల్లెటూరి నేపథ్యంలో జరిగే కథ కూడా అవడంతో.. ఎక్కువగా ఒకటే తరహాగా కనిపించే ప్రాంతాలలో చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే లొకేషన్స్ సహా అన్నీ ఫిక్స్ అయిపోవడంతో.. చాలా వేగంగా చరణ్ మూవీ పూర్తి కానుందనే టాక్ వినిపిస్తోంది. సుకుమార్ కెరీర్ లోనే అత్యంత వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేసిన మూవీ కూడా ఇదే అంటున్నారు. ధృవ సక్సెస్ తో జోష్ మీదున్న రామ్ చరణ్.. నాన్నకు ప్రేమతో లాంటి విభిన్నమైన చిత్రం తర్వాత ప్రేక్షకులను అలరించనున్న సుకుమార్ ల కాంబినేషన్.. ఆడియన్స్ ను ముఖ్యంగా మెగాభిమానుల్లో తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేస్తోంది.