Begin typing your search above and press return to search.

నిజంగా అలానే ఉన్నారు..

By:  Tupaki Desk   |   28 March 2018 12:11 PM GMT
నిజంగా అలానే ఉన్నారు..
X
టెక్నాలజీ కి దూరంగా ఎక్కడన్నా మనశ్శాంతి గా కొన్ని రోజులైనా గడలపాలని అందరికి ఎప్పుడో అప్పుడు అనిపిస్తుంది. కానీ నిజంగానే పల్లెటూరికి వెళ్లి ఉండటం అంటే కొంచెం కష్టమైన పనే. అందరూ చేయగలిగే పని అయితే కాదు. కానీ మన రంగస్థలం టీం మాత్రం సినిమా షూటింగ్ అంతా గోదావరి దగ్గర కొన్ని పల్లెటూర్లలో పూర్తి చేసిన విషయం తెలిసందే. అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

సుకుమార్.. టాలీవుడ్ లో ఉన్న దర్శకులతో ఇంటెలిజెంట్ అనే బిరుదు ఉన్న డైరెక్టర్. రామ్ చరణ్.. మెగా స్టార్ చిరంజీవి కొడుకు మరియు చిరు తో పాటు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మెగా పవర్ స్టార్. రత్నవేలు.. సినిమాటోగ్రఫీ ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ముగ్గురూ ఎవరి ఫీల్డ్స్ లో వాళ్ళు స్టార్లే. వాళ్ళు ఉన్నట్టుండి పల్లెటూరి వాళ్ళలా మారిపోతే ఎలా ఉంటుంది? ఆ ఫొటోలో వాళ్ళు అలానే ఉన్నారు. కాళ్ళకి చెప్పులు లేవు. అస్సలు సినిమా గురించి తెలియని వాళ్లేవారికైనా ఈ ఫోటో ఒక్కసారిగా చూపిస్తే, పల్లెటూరి వాళ్ళే అని అనుకుంటారు.

ముగ్గురూ నెలపైన కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు. చూస్తూ ఉంటే రంగస్థలం సినిమా పల్లెటూరి బాక్ డ్రాప్ లో వస్తున్నందున, షూటింగ్ లో మునిగిపోయి వాళ్ళు కూడా అలానే మారిపోయారు. సినిమాకు కోటి రూపాయలు డిమాండ్ చేసే రత్నవేలు - 5 కోట్లు తీసుకునే సుకుమార్ - 10 కోట్లకు తగ్గేది లేని రామ్ చరణ్ ను ఇలా చూడటం భలేగా ఉంది కదూ?