Begin typing your search above and press return to search.
చెర్రి విత్ పూరి-జరిగే పనేనా
By: Tupaki Desk | 30 Jan 2018 11:46 AM ISTఏ బాషా సినిమా పరిశ్రమ అయినా ఇక్కడ సక్సెస్ ఉన్నవాడికే పలకరింపు ఉంటుంది. తేడా వచ్చింది అంటే నిన్నటి దాకా భుజాల మీద మోసుకుని తిరిగిన వాళ్ళే ఈ రోజు కనపడగానే మొహం చాటేస్తారు. ఇది అన్ని రంగాల్లో ఉన్నదే కనక ఫిలిం ఇండస్ట్రీ దానికి మినహాయింపు కాదు. ఈ విషయం పూరి జగన్నాధ్ కు బాగా అర్థం అయ్యింది. ఇడియట్ - పోకిరి - అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి వరస హిట్లతో బాక్స్ ఆఫీస్ ని ఓ ఆటాడుకున్న పూరి ఈ మధ్య తనకే బోర్ కొట్టేంత రొటీన్ మాఫియా మసాలా కథలతో హ్యాట్రిక్ డిజాస్టర్లు వరస బెట్టి కొడుతున్నాడు. బాలకృష్ణ కోరి మరి అవకాశం ఇస్తే పైసా వసూల్ రూపంలో తన మీద అంచనాలు నిలబెట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం తన కొడుకుని పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న ఇండో-పాక్ లవ్ స్టొరీ మెహబూబా షూటింగ్ కీలక దశలో శరవేగంగా సాగుతోంది. ఇప్పుడు వస్తున్న ప్రశ్న పూరి వాట్ నెక్స్ట్.
తాజా అప్ డేట్ ప్రకారం తన దర్శకత్వంలో టాలీవుడ్ కు పరిచయమైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఈ మధ్య కలిసాడట పూరి. కాని కథ పట్ల అంత పాజిటివ్ గా స్పందించలేకపోయిన చెర్రి ఈ సారి మంచి కథ బయటి నుంచి ఏదైనా తీసుకువస్తే అది తీసే ఆలోచన చేద్దాం అని చెప్పాడట. దీనికి కారణం పూరికి గత ఐదేళ్ళలో చెప్పుకోదగ్గ హిట్ ఒక్క టెంపర్ మాత్రమే. దానికి కథ రాసుకుంది పూరి కాదు. వక్కంతం వంశీ ఇచ్చాడు. తనలో నిజమైన దర్శకుడిని ఆ ఒక్క సినిమాలో మళ్ళి చూపించాడు పూరి.
అందుకే కథ బయటవాళ్ళు ఇచ్చినదైనా పర్వాలేదు అదే చేద్దాం అని చెప్పి హామీ ఇచ్చి పంపినట్టు టాక్. పూరి ఈ దిశగా కూడా ఆలోచిస్తే బెటర్ అంటున్నారు సన్నిహితులు. ఒక చట్రం దాటి కథలు రాసుకోలేని బలహీనత నుంచి పూరి బయటపడాలి అంటే వేరే రైటర్స్ సహాయం తీసుకోవడం చాలా అవసరం. అది గతంలోనే ప్రూవ్ అయ్యింది కాబట్టి చరణ్ సలహాని పూరి సీరియస్ గా తీసుకుని కొత్త కథతో మెప్పించే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి. కాని అది ఈ ఏడాది జరిగే ఛాన్స్ మాత్రం లేదు.