Begin typing your search above and press return to search.

బ్యాచిలర్‌ కు రామ్‌ చరణ్‌ స్పెషల్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   19 Oct 2021 9:30 AM GMT
బ్యాచిలర్‌ కు రామ్‌ చరణ్‌ స్పెషల్ కామెంట్స్‌
X
అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరోగా నటించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు మరియు టాక్ సినిమా సక్సెస్ అని నిరూపిస్తున్నాయి. ఆరు సంవత్సరాలుగా అక్కినేని ఫ్యాన్‌ ఎదురు చూస్తున్న సక్సెస్‌ ను ఎట్టకేలకు అఖిల్ దక్కించుకున్నాడు. మొదటి సినిమా సమయం నుండి ఇప్పటి వరకు ఫ్యాన్స్ ను సంతృప్తి పర్చేందుకు అఖిల్ చాలా కష్టపడ్డాడు. చివరకు బ్యాచిలర్‌ సినిమా తో ఆ సక్సెస్ దక్కింది. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల వారు పలువురు స్పందిస్తున్నారు. సినిమా సక్సెస్‌ నేపథ్యంలో పలువురు ప్రముఖ స్టార్స్ అఖిల్‌ అక్కినేనికి అభినందనలు తెలియజేస్తున్నారు.

తాజాగా స్టార్‌ హీరో రామ్‌ చరణ్ కూడా బ్యాచిలర్‌ పై స్పెషల్‌ కామెంట్స్ చేశాడు. నా తమ్ముడు అఖిల్‌ అక్కినేని మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమా తో సక్సెస్ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో నీ నటన కు ఫిదా అయ్యాను. పూజా మరోసారి నీవు నీ పాత్రకు పూర్తి న్యాయం చేశాను. ఆ పాత్రలో జీవించావు. నిర్మాణ సంస్థకు మరియు బొమ్మరిల్లు భాస్కర్‌ కు హృదయ పూర్వక శుభాకాంక్షలు. సినిమాను మేము బాగా ఎంజాయ్ చేశాము అంటూ ట్వీట్‌ చేశాడు. రామ్‌ చరణ్‌ ట్వీట్‌ తో బ్యాచిలర్ వెయిట్‌ మరింతగా పెరిగినట్లయ్యింది. సినిమాకు మరింతగా వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ కు చేరువ అయ్యింది.

అఖిల్‌ కెరీర్‌ లో మొదటి సారి బ్రేక్ ఈవెన్ సాధించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బ్యాచిలర్‌ సినిమా సక్సెస్ తో అఖిల్‌ జోరు పెంచుతున్నాడు. తన ఏజెంట్ సినిమాను సాధ్యం అయినంత త్వరగా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక రామ్‌ చరణ్ విషయానికి వస్తే వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల కాకుండానే శంకర్ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా ను ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాను చేసేందుకు గాను ఇప్పటికే డేట్లు కూడా ఇచ్చేశాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో చరణ్‌ రెడీ అవ్వబోతున్నాడు.