Begin typing your search above and press return to search.
`ఆచార్య`లో చరణ్ ఎమోషనల్ ఎంట్రీకి గగుర్పాటే..!
By: Tupaki Desk | 23 Dec 2020 9:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే విజేతకు ట్రోఫీ అందించిన చిరు అటుపై పూర్తిగా తన `ఆచార్య` షూటింగ్ మోడ్ లోనే ఉన్నారు. అలాగే తదుపరి సినిమాల స్క్రిప్టుల్ని దర్శకుల్ని ఫైనల్ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం ఆచార్య షూటింగ్ జోరందుకుంది. దేవాదాయ శాఖ కుంభకోణం నేపథ్యంలో సోషియో పొలిటికల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ ఆద్యంతం కొరటాల ఎమోషనల్ గా తీర్చిదిద్దుతున్నారని సమాచారం.
ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 40 నిమిషాల నిడివి ఉన్న కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణను పూర్తి చేసుకుని.. 2021 మార్చి నుంచి ఆచార్య చిత్రీకరణకు హాజరు కానున్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ పరిచయ సన్నివేశం అద్భుతంగా ఉంటుందిట. థియేటర్లలో జనం కుర్చీలకు అతుక్కుని చూసే సన్నివేశమిదని చెబుతున్నారు. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా గగుర్పాటుకు గురి చేసే సన్నివేశంతో చెర్రీ ఎంట్రీ ఇస్తారట. ఇందులో మాస్ ఎలిమెంట్స్ తో చరణ్ ప్రవేశం చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది.
అలాగే చిరు సరసన ఈ మూవీలో కాజల్ నటిస్తోంది. ఇటీవలే తను సెట్స్ లో చేరారు. చరణ్ రొమాన్స్ చేసే హీరోయిన్ కోసం వేట సాగుతోంది. వినయ విధేయ రామా ఫేం కియరా అద్వాణీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.