Begin typing your search above and press return to search.

`చిరు-చ‌ర‌ణ్` కావాల్సిందేనంటూ ఒత్తిడి తెచ్చాడా?

By:  Tupaki Desk   |   2 July 2020 3:30 AM GMT
`చిరు-చ‌ర‌ణ్` కావాల్సిందేనంటూ ఒత్తిడి తెచ్చాడా?
X
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వైర‌స్ తో స‌హ‌జీవ‌నం చేయాల్సిందేన‌ని ఖ‌రాకండిగా చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌స్తుత వ్య‌వ‌హారం కొన‌సాగుతోంది. వైర‌స్ మ‌హ‌మ్మారీ అంత‌కంత‌కు విజృంభిస్తుంటే ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి.

ఇక ఈ స‌న్నివేశాన్ని టాలీవుడ్ స్టార్లు అర్థం చేసుకుని అందుకు ప‌క్కాగా ప్రిపేర‌వుతున్నారా? అంటే కొంద‌రు హీరోలు ఇన్నాళ్లు వేచి చూసే ధోర‌ణితో ఉన్నామ‌ని తెలిపారు. కానీ మునుముందు ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చేట్టు క‌నిపించ‌డం లేదు. దీంతో పెండింగ్ షూటింగులు ఉన్న వాళ్లు ఇక వెన‌కంజ వేస్తే క‌ష్ట‌మేన‌ని భావిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.

అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి త్వ‌ర‌లోనే ఆచార్య చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నార‌ని తాజాగా లీక్ అందింది. అంటే చిరు అంత‌టి వారే మెంట‌ల్ గా ప్రిపేరైపోయార‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆచార్య చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేసేందుకు ఉన్న ఆస్కారాన్ని చిరు ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఇక అన్న‌య్య రాక‌కోసం కొర‌టాల శివ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. కానీ ఇక్క‌డో చిక్కు ముడి ఉంది.

చిరుతో పాటు చ‌ర‌ణ్ కూడా సెట్స్ కి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా జ‌ర‌గాలంటే ఆర్.ఆర్.ఆర్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నుంచి అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి. ఆ క్ర‌మంలోనే చిరు రాజ‌మౌళిని ఇదే విష‌య‌మై ప్ర‌శ్నించార‌ట‌. ఒక‌సారి చిత్ర‌బృందం స‌హా చ‌ర‌ణ్ తో షెడ్యూల్ గురించి మాట్లాడి చెబుతాన‌ని జ‌క్క‌న్న చిరుకి మాటిచ్చార‌ట‌. అంటే చ‌ర‌ణ్ పై స‌న్నివేశాల్ని రాజ‌మౌళి పూర్తి చేసేందుకు ఇక మ‌న‌సా వాచా ప్రిపేర‌వుతున్నార‌నే దీన‌ర్థం. వేచి చూస్తే మ‌హ‌మ్మారీ పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. అలా అని భ‌య‌ప‌డితే ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీకి అది ఇబ్బందిక‌రం. కాస్త చొర‌వ తీసుకుని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ షూటింగును ముగించేసేందుకు ఉన్న ఆస్కారాన్ని రాజ‌మౌళి ప‌రిశీలిస్తున్నార‌ట‌. చ‌ర‌ణ్ షెడ్యూల్ పై స్ప‌ష్ఠ‌త వ‌చ్చేస్తే ఇక ఆచార్య‌కు లైన్ క్లియ‌రైన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఒక విధంగా చూస్తే జ‌క్క‌న్న‌పైనా.. చిరంజీవిపైనా ఒత్తిడి నెల‌కొంది. చ‌ర‌ణ్ ని ఎలా అయినా ఆచార్య సెట్స్ కి ర‌ప్పించేందుకు కొర‌టాల ఒత్తిడి చేస్తున్నారన్న‌మాట‌.