Begin typing your search above and press return to search.

చరణ్ ఫ్రీ అయితే కానీ ఆచార్యకు మోక్షం లేదు!

By:  Tupaki Desk   |   1 Jun 2020 10:30 AM GMT
చరణ్ ఫ్రీ అయితే కానీ ఆచార్యకు మోక్షం లేదు!
X
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమా దసరాకు విడుదల కావాల్సింది. అయితే షూటింగు ఆలస్యం కావడం.. గత రెండు నెలలుగా పూర్తిగా ఆగిపోవడంతో ఈ సినిమా మరోసారి వాయిదాపడడం ఖాయమని అనుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తారనే టాక్ వినిపించింది.

అది కూడా ఇప్పుడు వీలయ్యేలా లేదని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకూ సగమే పూర్తయిందని టాక్ ఉంది. పెండింగ్ ఉన్న అర్థభాగంలో రామ్ చరణ్ పోర్షన్ కూడా ఉంది. నిజానికి 'ఆచార్య' షూటింగ్ 'RRR' పై ఆధారపడి ఉందనే సంగతి తెలిసిందే. 'RRR' పూర్తైన తర్వాతే చరణ్ 'ఆచార్య' షూటింగు లో జాయిన్ కావాలనేది రాజమౌళి కండిషన్ అని.. 'RRR వాయిదా పడుతూ ఉండడంతో ఆ ప్రభావం 'ఆచార్య' పై పడుతోందని అంటున్నారు. రామ్ చరణ్ ఎప్పుడు 'ఆచార్య' షూటింగ్ లో పాల్గొంటాడనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదట. దీంతో 2021 సంక్రాంతికి 'ఆచార్య' రిలీజ్ కావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.

సంక్రాంతి తర్వాత బెస్ట్ సీజన్ సమ్మర్. అయితే వచ్చే ఏడాది సమ్మర్ లో 'RRR' రిలీజ్ కనుక ఫిక్స్ చేస్తే 'ఆచార్య' సమ్మర్ సీజన్ కష్టమే. దీంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు రిలీజ్ చెయ్యాలి అనే విషయంలో సందిగ్ధత నెలకొందట. రామ్ చరణ్ 'RRR' షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో తెలిస్తే తప్ప 'ఆచార్య' పై క్లారిటీ వచ్చే అవకాశం లేదట.