Begin typing your search above and press return to search.

మణితో చెర్రీ సినిమా కుదిరేనా

By:  Tupaki Desk   |   9 April 2017 10:51 AM IST
మణితో చెర్రీ సినిమా కుదిరేనా
X
దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది. మిలీనియంకు పూర్వం ఈయన తీసిన చిత్రాలు అన్నీ క్లాసిక్స్ గానే మిగిలిపోయాయి. ఆ తర్వాత మెల్లగా తన వైభవాన్ని కోల్పోతూ వచ్చారు మణిరత్నం. ఓకే బంగారం మూవీతో మళ్లీ ఇప్పటి ట్రెండిగ్ డైరెక్టర్లతో పోటీ పడుతున్నారని అంతా భావించారు కానీ.. ఆ ఆశలన్నీ చెలియాతో అటకెక్కేశాయి.

అయితే.. రామ్ చరణ్ తో మణిరత్నం కాంబినేషన్.. చాలా కాలం నుంచే వినిపిస్తున్న మాట. మెగా పవర్ స్టార్ ను RAW(రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ గా చూపిస్తూ ఓ సూపర్బ్ థీమ్ తో మూవీ తీయాలన్నది మణి రత్నం ఆలోచన. ఈ దిగ్గజ దర్శకుడితో సినిమాపై గతంలో చెర్రీ కూడా చెప్పాడు. కాకపోతే డిస్కషన్స్ జరుగుతున్నాయని అన్నాడు. కానీ ఇప్పుడు చెలియా మూవీని.. దాని రిజల్ట్ ను చూసిన ఎవరికైనా ఓ విషయం బోధపడిపోతుంది. తనదైన స్పెషల్ టచ్ ను రొమాంటిక్ సన్నివేశాల్లో తప్ప.. మరే ఇతర సీన్స్ లోను మణిరత్నం చూపలేకపోయారన్నది నిస్సందేహమైన విషయం.

రోజా కథనే మళ్లీ అటూ ఇటూ చేసి కార్గిల్ కు ముడిపెట్టి స్టోరీ ముగించిన వైనం చెలియాలో కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో రామ్ చరణ్-మణిరత్నం కాంబినేషన్ సాధ్యమవుతుందా అన్నదే ఆసక్తికరమైన విషయం. అసాధ్యమే అన్నది సన్నిహితుల భోగట్టా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/