Begin typing your search above and press return to search.

వైర‌ల్ గా రామ్ చ‌ర‌ణ్ ర్యాంబో లుక్‌

By:  Tupaki Desk   |   12 Jan 2022 2:30 AM GMT
వైర‌ల్ గా రామ్ చ‌ర‌ణ్ ర్యాంబో లుక్‌
X
తెలుగులో పాన్ ఇండియా స్టార్ ల లిస్ట్ పెరిగిపోతోంది. ప్ర‌తీ హీరో పాన్ ఇండియా స్థాయి సినిమాల‌తో త‌న మార్కెట్ పెంచుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ జాబితాలో ప్ర‌భాస్, అల్లు అర్జున్ చేరిపోయారు. `RRR` తో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేర‌బోతున్నారు. ఇదిలా వుంటే `RRR` రిలీజ్ వాయిదా ప‌డ‌టంతో వృధా అయిన స‌మ‌యాన్ని రామ్ చ‌ర‌ణ్...క్రేజీ డైరెక్ట‌ర్ శంక‌ర్ చిత్రానికి కేటాయిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన భారీ సెట్ ల నిర్మాణం చెన్నైలో జ‌రుగుతోంది. శంక‌ర్ గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఈ మూవీ కూడా భారీ హంగుల‌తో తెర‌పైకి రానుంద‌ని తెలుస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం త‌న శ్రీ‌మ‌తి ఉపాస‌న‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ వెకేష‌న్ ని ఎంజాయ్ చేస్తున్నార‌ట‌.

ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌య‌టికి వ‌చ్చిన ఓ స్టిల్ వైర‌ల్ గా మారింది. ర్యాంబో త‌ర‌హాలో ష‌ర్ట్ లేకుండా మెలితిరిగ‌న కండ‌ల‌తో ఒళ్లంతా టాటూల‌తో అచ్చం హాలీవుడ్ హీరోలా క‌నిపిస్తున్నచ‌ర‌ణ్‌ స్టిల్ ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ స్టిల్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `విన‌య విధేయ రామ‌` చిత్రంలోనిది. ఈ మూవీ విడుద‌లై నేటికి మూడేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా తాజాగా ఈ స్టిల్ ని బ‌య‌టికి రిలీజ్ చేశారు.

అజార్ బైజాన్ లో రామ్ చ‌ర‌ణ్, ప్ర‌శాంత్, వివేక్ ఓబెరాయ్ పాల్గొన‌గా కీల‌క యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ మెలితిరిగిన కండ‌ల‌తో ర్యాంబోలా క‌నిపించే స‌న్నివేశాలు అభిమానుల‌ని అబ్బుర‌ప‌రిచాయి. ఈ స‌న్నివేశాల స‌మ‌యంలో చ‌ర‌ణ్ మెషిన్ గ‌న్ ప‌ట్టుకుని ప్ర‌త్య‌ర్థుల‌పై తూటాల వ‌ర్షం కురిపిస్తున్న సంద‌ర్భంలో తీసిన స్టిల్ తాజాగా నెట్టింట వైర‌ల్ గా మారింది.

రామ్ చ‌ర‌ణ్ - బోయ‌పాటి శ్రీ‌నుల తొలి క‌ల‌యిక‌లో రూపొందిన చిత్ర‌మిది. హై వోల్టేజ్ మాస్ యాక్ష‌న్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన బోయ‌పాటి శ్రీ‌ను ఈ మూవీని కూడా అదే త‌ర‌హాలో తెర‌కెక్కించారు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. ఎంత స్టార్ కాస్ట్ వున్నా కంటెంట్ లేక‌పోవ‌డంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. కానీ యూట్యూబ్ లో మాత్రం దుమ్ము దులిపేస్తుండ‌టం విశేషం.