Begin typing your search above and press return to search.
కొరటాల ఒత్తిడితో కాస్త తగ్గిన చరణ్
By: Tupaki Desk | 22 Jan 2019 11:18 AM ISTమెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో అనే విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా ఆ చిత్రం గురించి కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా అధికారిక ప్రకటన చేయడం జరిగింది. మొదటి నుండి ఈ చిత్రంను చరణ్ నిర్మిస్తున్నాడని వార్తలు వచ్చాయి. నాన్న సినిమాను నేనే నిర్మిస్తానంటూ చరణ్ కూడా పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. కాని ఉన్నట్లుండి చిరు 152వ చిత్ర నిర్మాణ భాగస్వామిగా మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ చేరడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
చిరు మూవీని చరణ్ తన బ్యానర్ లోనే నిర్మించాలని భావించినప్పటికి కొరటాల శివ ఒత్తిడితో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ కు కొద్ది మొత్తంలో షేర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కు కొరటాల శివ ఒక చిత్రం చేయాల్సి ఉంది.
చాలా రోజుల క్రితమే వారి వద్ద అడ్వాన్స్ ను కొరటాల తీసుకున్నాడట. అయితే వరుసగా వేరే బ్యానర్ లలో సినిమాలు చేస్తున్న కొరటాల తమ వద్ద అడ్వాన్స్ తీసుకుని సినిమా చేయడం లేదని ఆ నిర్మాతలు అంటూ ఉండవచ్చు. అందుకే చిరు సినిమాలో చరణ్ తో మాట్లాడి, బలవంతంగా వారికి కొరటాల షేర్ ఇప్పించి ఉండవచ్చు అనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.
చిరంజీవి ఖైదీ నెం.150 తో చరణ్ నిర్మాణం ప్రారంభించి, చిరు 151వ చిత్రం సైరాను కూడా భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పుడు చిరు 152వ చిత్రాన్ని కూడా చరణ్ మేజర్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాడు. ఆ తర్వాత అయినా చిరును వేరే నిర్మాతలకు చరణ్ వదులుతాడేమో చూడాలి.