Begin typing your search above and press return to search.

దీపావళికీ చెర్రీ కర్చీఫ్ వేసేశాడు

By:  Tupaki Desk   |   23 Oct 2015 11:30 AM GMT
దీపావళికీ చెర్రీ కర్చీఫ్ వేసేశాడు
X
పండుగ సెలవలకు స్టార్ హీరోల సినిమాలు.. ఇదో ట్రెండింగ్ టాపిక్ ఇపుడు. దసరా పండక్కి బ్రూస్ లీ రిలీజ్ తో మొదలైన వివాదం ఇది. కొత్త సినిమాలు కూడా వచ్చేయడంతో.. మాటల తూటాలు ఆగాయి. టాలీవుడ్ కూడా కాస్త రిలాక్స్ అవుతున్న టైంలో.. దీపావళికి రిలీజ్ కానున్న ఓ మూవీ.. మరోసారి చెర్రీని వివాదంలోకి లాగేట్లుగా ఉంది. దీపావళికి పండుగ సీజన్ కి వరుసగా సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో బెంగాల్ టైగర్ - అఖిల్ పెద్ద చిత్రాలు కాగా.. మరిన్ని మూవీస్ రిలీజ్ లిస్ట్ లో ఉన్నాయి.

ఇన్ని సినిమాలు షెడ్యూల్ చేసి ఉండగా.. సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో కూడా అదీ సీజన్ కు వచ్చేస్తోంది. నవంబర్ 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. సూరజ్ ఆర్ బరజాత్యా తీసిన ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. గతంలో వచ్చిన ప్రేమపావురాలు - ప్రేమాలయం కాంబినేషన్ కావడంతో.. హిందీలోనే కాదు.. తెలుగులోనూ భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు. దీంతో ఇది మెగా మూవీస్ లిస్ట్ లోకి చేరిపోయింది. అసలే హైప్ ఎక్కువగా ఉన్న ప్రేమ్ రతన్ ధన్ పాయో.. మెగావారసుడి వాయిస్ జతవడంతో.. మరింత పెద్ద సినిమా అయిపోయింది తెలుగులో. ఈ మూవీ రిలీజ్ కి చెర్రీకి ఎలాంటి సంబంధం లేకపోయినా.. మరోసారి చరణ్ కి మాటల తూటాలు ఎదురవక తప్పేట్లు లేదు.