Begin typing your search above and press return to search.

మళ్ళీ కాజల్‌ నే ఓకే చేశాడా??

By:  Tupaki Desk   |   29 Sept 2015 10:24 AM IST
మళ్ళీ కాజల్‌ నే ఓకే చేశాడా??
X
కొన్ని కాంబినేషన్ లు అంతే.. చూడ్డానికి చూడముచ్చటగా ఉంటాయి. అందుకే మనోళ్ళు పదే పదే అవే కాంబినేషన్ లను సెట్‌ చేస్తుంటారు. అయితే పవన్‌ కళ్యాన్‌ - అల్లు అర్జున్‌ వంటి హీరోలు మాత్రం ఇప్పటి వరకు కెరియర్‌ లో ఎన్ని సినిమాలు చేసినా 99% ఒకసారి జతకట్టిన హీరోయిన్‌ తో మరోసారి జతకట్టిందే లేదు. అదే వాళ్ళ స్పెషల్‌. కాని మరో మెగా హీరో రామ్‌ చరణ్‌ మాత్రం తండ్రి చిరంజీవి లా కాంబినేనస్ లను లైక్‌ చేస్తున్నాడు.

అదిగో మనోడు తొలిసారి 2009లో ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ తో మగధీర సినిమాలో చేశాడు. ఆ తరువాత నాయక్‌ - ఎవడు - గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో కలసి నటించారు. అయినాసరే ఇప్పటికే చరణ్‌ ఏదైనా సినిమా ఉందంటే ముందుగా కాజల్‌ పేరును ఓసారి సిఫార్సు చేస్తాడట. హీరోయిన్‌ కాస్త ముదురు లుక్‌ లో కనిపంచాలంటే చాలు వెంటనే కాజల్‌ నే తీసుకుంటున్నారట. అదిగో ఇప్పుడు తమిళ సినిమా 'తని ఒరువన్‌' రీమేక్‌ వస్తోందిగా.. సురేందర్‌ రెడ్డి డైరక్షన్‌ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా మరోసారి ఈ భామ పేరే వినిపిస్తోంది.

తమిళంలో హీరోయిన్‌ గా నయనతార అలరించింది. వాస్తవానికి సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్‌ అంతేమీ ఉండదులేండి. అందుకే కాజల్‌ అయితే ఆ మెట్యూర్డ్‌ లుక్‌ కు కరక్టుగా సెట్టవ్వుద్దని ఫీలవుతున్నారట. చూద్దాం.. షూటింగ్‌ మొదలయ్యే వరకు హీరోయిన్‌ ఎవరు కన్‌ ఫామ్‌ అనేది చరణ్‌ సినిమాల విషయంలో ఈ మధ్యన చెప్పలేకపోతున్నాం. ఎన్నసార్లు సమంతను పెట్టుకొని తీసేయలేదు చెప్పండి!!