Begin typing your search above and press return to search.
ఇంతకీ పూరీకి మెగా ఆఫర్ ఇవ్వలేదా?
By: Tupaki Desk | 11 Aug 2019 10:14 AM ISTఇస్మార్ట్ శంకర్` చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి పూరి తిరిగి ట్రాక్ లో పడిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు ఎదురు చూపులు చూస్తే కానీ దక్కని విజయమిది. ఈ సక్సెస్ పూరిలో బోలెడంత జోష్ నింపింది. ఈ ఉత్సాహంలోనే అతడు మెగా కాంపౌండ్ .. నందమూరి కాంపౌండ్ హీరోలతో పాటు నవతరంలో విజయ్ దేవరకొండ.. నిఖిల్ లాంటి హీరోల వైపు చూస్తున్నారట. అయితే ఇప్పటివరకూ ఏ ప్రాజెక్టును పూరి అధికారికంగా ప్రకటించలేదు.
ఇంతకీ పూరి ఎవరితో సినిమా చేస్తారు? `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ తర్వాత మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి- రామ్ చరణ్ లాంటి స్టార్లు స్పందించి పూరికి శుభాకాంక్షలు తెలిపారు. వీళ్లలో ఎవరైనా పూరీతో సినిమా చేయబోతున్నారా? చిరుకి ఇదివరకూ `ఆటో జానీ` కథ వినిపించిన పూరి తిరిగి ఆ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి మెగా బాస్ ని కలవబోతున్నారా? లేదూ `చిరుత` రామ్ చరణ్ ఏదైనా ఆఫర్ ఇస్తున్నారా? అంటూ అభిమానుల్లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది.
సరిగ్గా ఇలాంటి టైమ్ లో పూరి - చరణ్ ఇద్దరూ ఒకే వేదిక (ప్రయివేటు కార్యక్రమం) పై కలుసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ వేదికపై చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్. ``నన్ను హీరోగా పరిచయం చేసన మా డైరెక్టర్ (పూరి జగన్నాథ్) `ఇస్మార్ట్ శంకర్` తో హిట్టు కొట్టారు.. ఈ మధ్యనే మాట్లాడాను.. ఏంటో చరణ్.. హిట్ చూసి మూడేళ్లయింది! అన్నారు. సార్.. ఇది మామూలే.. మేమూ అలాంటివి చూశాం. కానీ మీరు మంచి లవబుల్ డైరెక్టర్. ప్రేక్షకులు ఒక్కసారి ప్రేమిస్తే మళ్లీ మరచిపోరు. మీ సినిమా కోసం వేచి చూస్తారంతే`` అని చరణ్ అన్నారు. అంతా బాగానే ఉంది కానీ `చిరుత`నయుడు పూరికి మరో ఆఫర్ ఇస్తున్నాడా లేదా? అన్నది మాత్రం చెప్పనేలేదు. మరి చరణ్ తో సినిమా కోసం పూరి ప్రయత్నించలేదా? తనని చిత్రపరిశ్రమకు హీరోగా పరిచయం చేసిన సెంటిమెంటుతో ఆఫర్ ఉంటుంది కదా? అంటూ అభిమానులు ఒకటే గుసగుసలాడుకుంటున్నారు.