Begin typing your search above and press return to search.

తేజ్‌ కెరీర్‌ బూస్టింగ్‌ కు చరణ్‌ తనవంతు సాయం!

By:  Tupaki Desk   |   2 Sep 2020 11:10 AM GMT
తేజ్‌ కెరీర్‌ బూస్టింగ్‌ కు చరణ్‌ తనవంతు సాయం!
X
రామ్‌ చరణ్‌ హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరో వైపు కొణిదెల ప్రొడక్షన్స్‌ ను ప్రారంభించి ఇప్పటికే ఖైదీ నెం.150 మరియు సైరా సినిమాలను నిర్మించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆచార్య సినిమాను ఈయన నిర్మిస్తున్నాడు. ఇదే సమయంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తో ఒక సినిమాను చేసేందుకు చరణ్‌ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. 20 కోట్ల లోపు బడ్జెట్‌ తో సాయి ధరమ్‌ తేజ్‌ తో ఒక సినిమాను నిర్మించి అతడి కెరీర్‌ కు బూస్ట్‌ ఇవ్వాలని భావిస్తున్నాడట. అందుకోసం కథలు కూడా వింటున్నాడట.

ఇటీవలే సాయి ధరమ్‌ బాడీలాంగ్వేజ్‌ కు సెట్‌ అయ్యే కథలను కూడా చరణ్‌ ఫైనల్‌ చేశాడని అందుకు గాను త్వరలోనే దర్శకుడిని కూడా కన్ఫర్మ్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు. యంగ్‌ డైరెక్టర్‌ తో మీడియం బడ్జెట్‌ తో రామ్‌ చరణ్‌ నిర్మాణంలో రూపొందబోతున్న సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా వచ్చే ఏడాదిలో సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు.

రామ్‌ చరణ్‌ మరో నిర్మాణ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. చరణ్‌ నిర్మాణంలో తేజ్‌ మూవీ అంటే ఖచ్చితంగా ఇద్దరికి కూడా ప్లస్‌ అవుతుందని అంటున్నారు. తేజ్‌ కెరీర్‌ కు ఒక మంచి హిట్‌ దొరకడంతో పాటు చరణ్‌ కు కమర్షియల్‌ గా లాభం దక్కడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.