Begin typing your search above and press return to search.
మెగా బ్యాచ్ కోలీవుడ్ మీద పడ్డారెందుకో
By: Tupaki Desk | 1 Feb 2016 11:00 PM ISTసర్దార్ గబ్బర్ సింగ్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్న పవన్ కళ్యాణ్.. తర్వాతి ప్రాజెక్ట్ ఏంటో తేలిపోయింది. ఎస్ జె సూర్య డైరెక్షన్ లో కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ మూవీ 'వేదాళం'ను రీమేక్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మెగా టీం కోలీవుడ్ మీద ఎందుకు పడ్డారన్నదే అసలు అర్ధం కాని విషయం.
మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ కోసం ఏడాదిన్నపాటు కథలు వెతికి.. చివరకు తమిళ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన విజయ్ మూవీ కత్తిని ఓకే చేశాడు. వివి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి.. త్వరలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇది ఫిక్స్ అవగానే మెగా తనయుడు రామ్ చరణ్ కూడా కోలీవుడ్ మూవీనే ఎంచుకున్నాడు. బ్రూస్ లీ ఫ్లాప్ ఎఫెక్ట్ నుంచి బయటపడేందుకు.. సేఫ్ జోన్ లో ఉండేదుకు గాను తని ఒరువన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే మొదలు కానుంది.
ఇప్పుడు మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ కూడా తన నెక్ట్స్ వెంచర్ గా కోలీవుడ్ మూవీనే సెలెక్ట్ చేసుకోవడం ఆశ్చర్యకరం. ఒకేసారి ఇలా మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలందరూ కోలీవుడ్ మీద పడ్డం ఆశ్చర్యం కలిగించే విషయం. రీమేక్ అంటే సేఫ్ ప్రాజెక్టే కానీ.. ఇలా ఒకేసారి రీమేకులకు దిగడం ఫ్యాన్స్ కి మింగుడుపడ్డం లేదు.