Begin typing your search above and press return to search.

బాబూ రామ్ చరణ్.. ఏంటీ టార్చర్

By:  Tupaki Desk   |   28 Dec 2015 5:00 PM IST
బాబూ రామ్ చరణ్.. ఏంటీ టార్చర్
X
‘బ్రూస్ లీ’ విడుదలైన వెంటనే తన కొత్త సినిమాను మొదలుపెట్టేసేలా కనిపించాడు రామ్ చరణ్. కానీ ఆ సినిమా విడుదలై రెండు నెలలు దాటిపోయింది. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ‘తనీ ఒరువన్’ రీమేక్ సెట్స్ మీదికి మాత్రం వెళ్లలేదు. ఇంకో నెల దాటాకైనా సినిమా మొదలవుతుందా అనేది డౌటుగానే ఉందిప్పుడు. తాజా సమాచారం ప్రకారం జనవరిలో కూడా ఈ సినిమా మొదలవదట. ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరగొచ్చని అంటున్నారు. ఇప్పటిదాకా చాలా చాలా కారణాలు చెప్పారు. ఇప్పుడు సినిమా ప్రారంభోత్సవం జనవరి నుంచి ఫిబ్రవరికి వాయిదా పడ్డానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డే కారణం అంటున్నారు.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి తన పర్సనల్ పనుల కోసం యుఎస్ వెళ్ళాడు. ఆ పనులు పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి రావడానికి ఇంకో 20 రోజులు పడుతుంది. సంక్రాంతి తర్వాతే అతను తిరగొస్తాడు. ఐతే ప్రస్తుతం సురేందర్ రెడ్డి లేకుండానే కొందరు రచయితలు కలిసి స్క్రిప్టు పని కానిస్తున్నారట. సురేందర్ వచ్చాక అతడికి ఓసారి ఫైనల్ స్క్రిప్టు వినిపించి.. మార్పులు చేర్పులు ఉంటే చేసి.. ఆ తర్వాతే సినిమాు మొదలుపెడతారట.

ఐతే మెగా ఫ్యామిలీలో ఇప్పుడిప్పుడే హీరోలుగా తొలి అడుగులు వేస్తున్న వరుణ్ తేజ్, సాయిధరమ్ యమ స్పీడు మీదుంటే చరణ్ మాత్రం ఇలా నాన్చుతుండటం పట్ల అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చరణ్ గత రెండు సినిమాలూ నిరాశ పరిచిన నేపథ్యంలో అతడి నుంచి హిట్టు సినిమా వస్తే చూద్దామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే చరణ్ మాత్రం ఇలా సినిమాల ఎంపికకే ఇంతింత టైం తీసుకుంటూ అభిమానుల్ని వెయిటింగులో పెడుతున్నాడు.