Begin typing your search above and press return to search.

మనస్ఫూర్తిగా పొగడాలంటే చెర్రీ తర్వాతే!

By:  Tupaki Desk   |   28 Sept 2017 11:27 PM IST
మనస్ఫూర్తిగా పొగడాలంటే చెర్రీ తర్వాతే!
X
టాలీవుడ్ లో ఈ మధ్య కాస్త ఛేంజ్ వచ్చింది. ఒకరి సినిమాల గురించి మరొకరు బాహాటంగా మాట్లాడుతున్నారు.. ప్రశంసలు .. బెస్ట్ విషెస్ లాంటివి కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఈ కల్చర్ కి ఆద్యం పోసింది మాత్రం రామ్ చరణ్ అనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఏ సినిమా అయినా నచ్చినా.. ఆ హీరోలు చిన్నా పెద్దా తేడా లేకుండా.. మొదటగా ఫోన్ చేసి అభినందించే వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ మూవీ జైలవకుశ.. టాక్ తో సంబంధం లేకుండా పెర్ఫామ్ చేస్తోంది. అయితే.. ఈమూవీలో ప్రతీ ఒక్కరూ ఎన్టీఆర్ నటనను తెగ పొగిడేస్తున్నారు. ఒకే గెటప్ లో ఉంటూ.. కేవలం తన నటనతో మూడు పాత్రలను మెప్పించిన ఎన్టీఆర్ యాక్టింగ్ అదుర్స్ అంటున్నారు. సినిమా రిలీజ్ మరుసటి రోజే ఎన్టీఆర్ కు ఫోన్ ద్వారా తన అభినందనలు తెలిపాడట మెగా పవర్ స్టార్. మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి తాను మెస్మరైజ్ అయిపోయానని.. ఈ జనరేషన్ లో ఇంతటి అద్భుతమైన నటనా శైలి.. నీకు మాత్రమే సొంతం అంటూ పొగడ్తల్లో ముంచేశాడట రామ్ చరణ్. కొన్ని రోజులు ఆలస్యంగా ఈ విషయం బైటకు వచ్చినా.. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అయిపోయింది.

గతంలో బాద్షా మూవీ పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక.. చెర్రీ-ఎన్టీఆర్ లు ఒకే కారులో వెళ్లడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. మహేష్ కూడా చెర్రీ మంచితనం గురించి సోషల్ మీడియా ద్వారా చెప్పిన సంగతి గుర్తు చేసుకోవాలి. శ్రీమంతుడు లాంటి ఓ మంచి సినిమా చేసిన తర్వాత.. తనకు ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ ఫోన్ చేయలేదని.. కానీ రామ్ చరణ్ ఒక్కడే మంచి కాన్సెప్ట్ తో చాలా మంచి సినిమా చేశారని అభినందించాడని.. సూపర్ స్టార్ అప్పట్లోనే చెప్పాడు. సింపుల్ గా చెప్పాలంటే.. దటీజ్ చరణ్ అని ఇండస్ట్రీ జనాలతో అనిపించేసుకుంటున్నాడు.